వామ్మో ఏప్రిల్ 23.. అతివృష్టి, అనావృష్టి రెండూ ఈనాడే.. ఈ డేట్‌తో ఆర్సీబీకి ప్రత్యేక అనుబంధం..

Published : Apr 23, 2023, 12:05 PM IST

IPL 2023:‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ  ఊరిస్తూ ప్రతీ ఏడాది  అభిమానులను  నిరాశపరుస్తున్న ఆ జట్టుకు  ఏప్రిల్ 23తో  ప్రత్యేక అనుబంధముంది. ఇదే తేదీన ఆ జట్టుకు అతివృష్టి, అనావృష్టి రెండూ నమోదయ్యాయి. 

PREV
17
వామ్మో ఏప్రిల్ 23.. అతివృష్టి, అనావృష్టి రెండూ ఈనాడే.. ఈ  డేట్‌తో ఆర్సీబీకి ప్రత్యేక అనుబంధం..
Image credit: PTI

ఐపీఎల్  లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు   మరే జట్టుకూ లేని ప్రత్యేక రికార్డులున్నాయి. పదిహేనేండ్లుగా  ‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ  ఊరిస్తూ ప్రతీ ఏడాది  అభిమానులను  నిరాశపరుస్తున్న ఆ జట్టుకు  ఏప్రిల్ 23తో  ప్రత్యేక అనుబంధముంది. ఇదే తేదీన ఆ జట్టుకు అతివృష్టి, అనావృష్టి రెండూ నమోదయ్యాయి. 

27
Image credit: Sandeep Rana

ఈ క్యాష్ రిచ్ లీగ్ లో  అత్యధిక  స్కోరు నమోదుచేసిన జట్టుగా  ఆర్సీబీ పేరిట ఘనమైన రికార్డుంది.   2013 సీజన్ లో ఆ జట్టు.. పూణె వారియర్స్ పై   263 పరుగుల భారీ స్కోరు చేసింది. ఏప్రిల్ 23న జరిగిన  ఈ మ్యాచ్ లోనే  క్రిస్ గేల్   175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

37
Image credit: Getty

ఐపీఎల్ లో  అత్యధిక స్కోరు  నమోదుచేసిన టీమ్ గా ఉన్న  ఆర్సీబీ.. ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా ఉంది. 2016లో కూడా  ఆర్సీబీ.. గుజరాత్ లయన్స్ పై  248 పరుగులు చేసింది.  కానీ ఇది నాణేనికి ఒకవైపు. ఆర్సీబీకి ఇంకో కథ కూడా  ఉంద. అదే అసలు ట్విస్ట్. 

47

ఈ లీగ్ లో అత్యల్ప స్కోరు  కూడా ఆర్సీబీ పేరిటే ఉంది. 2017  సీజన్ లో ఆర్సీబీ..  కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడుతూ ఐపీఎల్ లో అత్యల్ప స్కోరు  చేసిన టీమ్ గా చెత్త రికార్డు  నమోదుచేసింది. 

57

ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్..  131 పరుగులకు ఆలౌట్ అయింది.   ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్సీబీ ద నానా తంటాలు పడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి 9.4 ఓవర్లలో  49 పరుగులకే ఆలౌట్ అయింది.  2013 ఏప్రిల్ 23న పూణెతో  175 పరుగులు చేసిన  గేల్..  2017లో కూడా ఆడాడు. కానీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. 

67

కేకేఆర్ తో మ్యాచ్ లో  కోహ్లీ డకౌట్ అయ్యాడు.   కోహ్లీతో పాటు గేల్, డివిలియర్స్ అందరూ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. కేదార్ జాదవ్  9 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.   ఇక గత సీజన్ లో కూడా ఇదే ఏప్రిల్ 23న  సన్ రైజర్స్  హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ..  68 పరుగులకు ఆలౌట్ అయింది.  2022 సీజన్ లో  36వ లీగ్ మ్యాచ్ లో  16.1 ఓవర్లలో  68 పరుగులకే చాప చుట్టేసింది. యాధృశ్చికంగా కోహ్లీ   ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. 

77

కాగా  నేడు ఆర్సీబీ..  రాజస్తాన్ రాయల్స్ తో  మ్యాచ్ లో  తలపడనుంది.   అసలే ఏప్రిల్ 23 కావడంతో  ఈ  సీజన్ లో  ఆర్సీబీ ఏ విధమైన షాకులిస్తుందోనని ఆ  జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.   నేటి మ్యాచ్ లో అతివృష్టో,  అనావృష్టో.. 

click me!

Recommended Stories