అర్జెంటుగా ఆ ఇద్దరికీ బలగం మూవీ చూపించండి... విరాట్, గంభీర్ గొడవపై రవిశాస్త్రి రియాక్షన్...

Published : May 02, 2023, 10:34 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ, పెను దుమారం రేగింది. అంతకుముందు ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్‌లో విరాట్ ప్రవర్తన హాట్ టాపిక్ అయినా లక్నో మ్యాచ్‌లో గంభీర్ కూడా ధీటుగా బదులు ఇవ్వడంతో పెద్ద రచ్చ జరిగింది..

PREV
17
అర్జెంటుగా ఆ ఇద్దరికీ బలగం మూవీ చూపించండి... విరాట్, గంభీర్ గొడవపై రవిశాస్త్రి రియాక్షన్...
gambhir kohli

2013లో మొదలైన గొడవ, పదేళ్లుగా సాగుతూనే ఉంది. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన గౌతమ్ గంభీర్, వీలైనప్పుడల్లా అతన్ని విమర్శిస్తూ వచ్చాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఎదురైన సందర్భాల్లో కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు...

27
Kohli vs Gambhir

బెంగళూరులో ఆర్‌సీబీని ఓడించిన తర్వాత గౌతమ్ గంభీర్ అంతా రియాక్ట్ కాకపోయి ఉంటే, లక్నోలో విరాట్ కోహ్లీ ఈ రేంజ్‌లో రియాక్ట్ అయ్యేవాడు కాదు...

37

ఈ ఇద్దరి మధ్య గొడవకి ముగింపు పలకాలంటే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లను కూర్చోబెట్టి బలగం మూవీ చూపించాలని అంటున్నారు మీమర్స్...

47

తమ్ముడికి కష్టం వస్తే అన్న చూడాలే, అన్నకి కష్టం వస్తే తమ్ముడు ఓర్వాలే... అని చెప్పినట్టు చెబితే, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌లకు ఎమోషనల్‌గా చెబితే కలిసిపోతారని మీమ్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ బలగం మూవీలో తాత, కాకి క్యారెక్టర్ల లెక్క ఈ ఇద్దరూ కలిసినా ఆ క్రెడిట్ ధోనీకే దక్కుతుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు...

57
Gambhir-Kohli

‘గౌతమ్ గంభీర్ డబుల్ వరల్డ్ కప్ విన్నర్. విరాట్ యూత్ ఐకాన్. ఇద్దరూ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లే. ఈ ఇద్దరినీ కూర్చోబెట్టి, ఈ గొడవకి ఇంతటితో ముగింపు పలకాలి. ఇక చాలు..

67
Gambhir-Kohli

ఎవరు చేస్తారో త్వరగా చేయడం. ఎందుకంటే ఇంకోసారి ఈ ఇద్దరూ గ్రౌండ్‌లో గొడవ పడితే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించలేకపోతున్నా. ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి..

77

అయితే చాలామంది మాత్రం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో ఇంకోసారి ఫేస్ అయితే చూడాలని కోరుకుంటున్నారు. ఫ్లేఆఫ్స్ లేకపోతే ఏకంగా ఫైనల్‌లో ఆర్‌సీబీ, లక్నో మధ్య మ్యాచ్ జరిగితే డ్రామా పీక్స్‌లోకి వెళ్తుందని దేవుడిని వేడుకుంటున్నారు..

click me!

Recommended Stories