ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. 9 మ్యాచుల్లో 364 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే స్పిన్ బౌలర్ల బౌలింగ్‌ని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు కోహ్లీ...
కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లలిత్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
26
Bishnoi vs Kohli
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
36
kohli out
కెరీర్ ఆరంభంలో స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఏ మాత్రం ఇబ్బంది పడని కోహ్లీ, సీనియర్ స్పిన్నర్లను కూడా చితక్కొట్టేవాడు.. అయితే నాలుగేళ్లుగా అతని బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది...
2008 సీజన్ సమయంలో స్పిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు 151.4 ఉండగా ఆ తర్వాత 2015లో 151.2 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశాడు. 2016 సీజన్‌లో పీక్ ఫామ్‌ని కొనసాగించిన కోహ్లీ,స్పిన్ బౌలర్ల బౌలింగ్‌లో కూడా 152.3 స్ట్రైయిక్ రేటుతో దుమ్మురేపాడు..
2020 సీజన్ నుంచి నాలుగేళ్లుగా విరాట్ కోహ్లీ స్పిన్ బౌలర్ల బౌలింగ్ ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతున్నారు. 2020 సీజన్‌లో స్పిన్ బౌలర్ల బౌలింగ్‌లో విరాట్ స్ట్రైయిక్ రేటు 108.9 ఉండగా 2021లో 100కి పడిపోయింది. 2022లో కాస్త పెరిగి 108.1 కి చేరింది. 2023 సీజన్‌లో ఇంకాస్త పెరిగి 109గా ఉంది..
66
Image credit: PTI
ఐపీఎల్‌లో ఇది పెద్ద సమస్య కాకపోయినా ఆ తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాని ఇబ్బంది పెట్టొచ్చు. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, స్పిన్ బౌలర్ల బౌలింగ్ భయాన్ని వదిలేస్తే పీక్ ఫామ్‌ని అందుకుంటాడనడంలో సందేహం లేదు..