హర్భజన్, శ్రీశాంత్‌ని కొట్టడం నుంచి కోహ్లీ, నవీన్ వుల్ హక్ దాకా... ఐపీఎల్‌లో రచ్చ లేపిన గొడవలు ఇవే..

First Published May 2, 2023, 7:52 PM IST

ఐపీఎల్, ఇండియన్ క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనే పెను మార్పులు తీసుకొచ్చిన క్రికెట్ లీగ్. ఐపీఎల్ కారణంగా ఎందరో శత్రువులు మిత్రులుగా మారారు, మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారారు. క్రికెట్ క్రీజులో కొట్టుకున్నవారూ ఉన్నారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వివాదంగా మారిన గొడవలు ఇవే...
 

శ్రీశాంత్‌‌ని కొట్టిన హర్భజన్ సింగ్:
2008 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ హర్భజన్ సింగ్, పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన భారత క్రికెటర్ శ్రీశాంత్‌ చెంప చెళ్లుమనిపించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. అసలు ఏమైందో ఏమో కానీ శ్రీశాంత్ చెంప మీద చేతి పెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడవడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత హర్బజన్, శ్రీశాంత్‌కి చాలాసార్లు క్షమాపణలు చెప్పాడు..

శ్రీశాంత్‌‌ని కొట్టిన హర్భజన్ సింగ్:
2008 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ హర్భజన్ సింగ్, పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన భారత క్రికెటర్ శ్రీశాంత్‌ చెంప చెళ్లుమనిపించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. అసలు ఏమైందో ఏమో కానీ శ్రీశాంత్ చెంప మీద చేతి పెట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడవడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత హర్బజన్, శ్రీశాంత్‌కి చాలాసార్లు క్షమాపణలు చెప్పాడు..

Latest Videos


హర్భజన్ సింగ్- అంబటి రాయుడి మధ్య గొడవ:
ఐపీఎల్‌లో వేర్వేరు టీమ్స్‌కి ఆడిన ప్లేయర్లు కొట్టుకోవడం కామన్, ఒకే టీమ్‌కి ఆడిన ప్లేయర్లు గొడవ పడడం వెరైటీ. ఇలాంటి సంఘటనే 2016లో జరిగింది.  హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో వచ్చిన క్యాచ్‌ని అంబటి రాయుడు అందుకోలేకపోయాడు. దీంతో భజ్జీ ఏదో తిట్టడం, దానికి అంబటి రాయుడు కోపంగా దూసుకురావడం జరిగిపోయాయి. ఈ సంఘటన తర్వాత భజ్జీ, అంబటి రాయుడికి సారీ చెప్పినా, అతను పట్టించుకోలేదు..

కిరన్ పోలార్డ్- మిచెల్ స్టార్క్ మధ్య గొడవ:
2014 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో కిరన్ పోలార్డ్, మిచెల్ స్టార్క్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలార్డ్‌ని స్టార్క్ సెడ్జ్ చేశాడు. ఆ తర్వాత స్టార్ రన్నప్ పూర్తి చేసుకుని బాల్ సమయానికి పోలార్డ్ నాట్ రెఢీ అంటూ తప్పుకున్నాడు. అయితే రన్నప్ పూర్తి చేసిన స్టార్క్ కోపంగా బంతిని వేయగా, వీరావేశానికి లోనైన పోలార్డ్ బ్యాటుని విసిరి కొట్టాడు...  ఈ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది..

Gambhir-Kohli

విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య మొదలైన చిచ్చు: 
2013 సీజన్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య తొలిసారి గొడవైంది. కోహ్లీని అవుట్ చేసిన లక్ష్మీపతి బాలాజీ ఏదో తిట్టడం, దానికి కోహ్లీ రియాక్ట్ కావడంతో గొడవ మొదలైంది. విరాట్ కోహ్లీపైకి గౌతమ్ గంభీర్ దూసుకురావడం, కోహ్లీ కూడా అదే స్థాయిలో ముందుకు రావడంతో ఈ ఇద్దరు ఢిల్లీ బాయ్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయి..

రవిచంద్రన్ అశ్విన్ - జోస్ బట్లర్:
2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ని మన్కడింగ్ ద్వారా అవుట్ చేశాడు. ఈ అవుట్ విషయంలో తీవ్ర వివాదం రేగింది. అశ్విన్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ వాదించారు చాలామంది. అయితే ఈ సంఘటన జరిగిన రెండేళ్లకు మన్కడింగ్ రనౌట్‌ని అధికారికం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ..

dhoni angry


మహేంద్ర సింగ్ ధోనీ-అంపైర్ల మధ్య గొడవ:
మిగిలిన ప్లేయర్లు అందరూ తోటి ప్లేయర్లతో గొడవ పడితే మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో లెగ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించడం, దాన్ని మరో అంపైర్ కరెక్ట్ బాల్‌గా మార్చడంతో వివాదం రేగింది. ఇదంతా డగౌట్‌లో నిలబడి చూస్తున్న ధోనీ, రూల్స్ అతిక్రమించి ఫీల్డ్‌లోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఒక్క నో బాల్ కోసం ధోనీ ఇంత అతి చేయడం చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు..

నితీశ్ రాణా- హృతీక్ షోకీన్: 
2023 సీజన్‌లో కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో ఢిల్లీ బాయ్స్ నితీశ్ రాణా, హృతీక్ షోకీన్ మధ్య గొడవైంది. రాణాని అవుట్ చేసిన షోకీన్, ఏదో తిట్టడం, దానికి కేకేఆర్ కెప్టెన్ స్పందించడంతో గొడవ మొదలైంది. ఈ మ్యాచ్‌ సమయంలో ఈ ఇద్దరూ మాట్లాడిన బూతులు, టీవీ కెమెరాల్లో స్పష్టంగా వినిపించాయి..

విరాట్ కోహ్లీ - లక్నో సూపర్ జెయింట్స్:
ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో లక్నో ప్లేయర్లు నవీన్ వుల్ హక్,  అమిత్ మిశ్రాతో పాటు మెంటర్ గౌతమ్ గంభీర్ గొడవ పెట్టుకున్నాడు. 2013లో కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య గొడవ జరిగిన పదేళ్లకు మరోసారి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య అలాంటి వాగ్వాదం జరిగింది.. 

click me!