కెప్టెన్‌గా ఎన్నో తప్పులు చేశా నిజమే! అయితే స్వార్థంతో ఏదీ చేయలేదు... - విరాట్ కోహ్లీ...

Published : May 13, 2023, 03:24 PM IST

టెస్టు క్రికెట్‌లో ఆల్‌టైం బెస్ట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. వన్డేల్లో అత్యధిక విజయాల శాతం అందుకున్న విరాట్ కోహ్లీ, స్వదేశంలో ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. తన కెప్టెన్సీలో జరిగిన తప్పులను కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు కోహ్లీ..  

PREV
18
కెప్టెన్‌గా ఎన్నో తప్పులు చేశా నిజమే! అయితే స్వార్థంతో ఏదీ చేయలేదు...  - విరాట్ కోహ్లీ...
Virat Kohli-Rohit Sharma

టీమిండియాకి 213 మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన విరాట్, 135 విజయాలు అందుకున్నాడు... కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో, శ్రీలంక, వెస్టిండీస్‌ల్లో టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది టీమిండియా. విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ..

28

అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, 2021 టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన భారత జట్టు, ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది...
 

38
Virat Kohli

‘నేను కెప్టెన్‌గా చాలా తప్పులు చేశాను. కచ్చితంగా దాన్ని ఒప్పుకుంటా. అయితే నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసిన ప్రతీ పని కూడా నిస్వార్థంగా చేశా. నా కోసం ఏదీ చేయలేదు, టీమ్ గెలవాలని, గెలుస్తుందనే ఆలోచనతో ప్రయత్నించా. అయితే అన్ని సార్లు అనుకున్నవి జరగవు కదా..

48
Virat Kohli

ఆ విషయంలో నేను గ్యారెంటీ ఇస్తా. నేను వ్యక్తిగత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు. టీమ్‌ని ఎలాగైనా గెలిపించాలనేదే నా బుర్రలో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. అలా తీసుకున్న కొన్ని నిర్ణయాలు వర్కవుట్ కాలేదు. బ్యాటర్‌గా తప్పులు చేస్తే అవుట్ అయినట్టే, కెప్టెన్‌గా తప్పులు చేస్తే ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది..

58
Image credit: PTI

ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, అయితే గెలవాలనే తపన మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. అందుకే ఎన్ని తప్పులు చేసినా మళ్లీ మళ్లీ విజయాల కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. అసలు ప్రయత్నమే చేయకపోతే విజయం ఎలా వస్తుంది..

68
Image credit: PTI

నేను ఏం చేసినా మంచి జరగాలనే ఉద్దేశంతోనే చేశాను. అయితే కొన్నిసార్లు నా నిర్ణయాలు కొందరికి నచ్చేవి కావు. ఇంకొన్ని సార్లు నేను తీసుకున్న నిర్ణయాలు, మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాయి.

78

అయితే సక్సెస్ అయిన వాటిని ఎంత గుర్తు పెట్టుకున్నానో ఫెయిల్ అయిన డెసిషన్స్ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నా... టీమిండియా కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు, ఆ బాధ్యతను పూర్తిగా ఎంజాయ్ చేశా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ.. 

88

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నెల రోజులకు విరాట్‌ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఇది జరిగిన 20 రోజులకు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ.. 

Read more Photos on
click me!

Recommended Stories