క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందే చెన్నైకి భారీ షాక్.. సీఎస్కేని వీడిన రూ. 16 కోట్ల ఆల్ రౌండర్

Published : May 21, 2023, 02:03 PM IST

IPL 2023: ఐపీఎల్  -16 లో  భాగంగా  శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించిన   చెన్నై సూపర్ కింగ్స్  ప్లేఆఫ్స్ కు చేరింది. ఫస్ట్ క్వాలిఫయర్ లో  ఆ జట్టు గుజరాత్ తో పోటీ పడనుంది. 

PREV
16
క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందే  చెన్నైకి భారీ షాక్.. సీఎస్కేని వీడిన రూ. 16 కోట్ల ఆల్ రౌండర్

గత సీజన్ లో  పేలవ ప్రదర్శనతో  9వ స్థానంలో నిలిచిన   చెన్నై సూపర్ కింగ్స్  ఐపీఎల్  - 16 లో మాత్రం   స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది.  ఈ సీజన్ లో  14 మ్యాచ్ లు ఆడిన ధోని సేన..   8 గెలిచి  ఐదింట్లో ఓడి  (లక్నోతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) 17 పాయింట్లతో  రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.   ఈ విజయంతో ధోని సేన ప్లేఆఫ్స్ లో  ఫస్ట్ క్వాలిఫయర్ ఆడనుంది.  

26

ఫస్ట్ క్వాలిఫయర్  మ్యాచ్ లో భాగంగా చెన్నై.. గుజరాత్ టైటాన్స్  తో చెన్నై వేదికగా తలపడనుంది.  అయితే ఈ మ్యాచ్ కు ముందే  చెన్నైకి  ఇంగ్లాండ్ ఆల్ రౌండర్, ఆ జట్టు  టెస్టు సారథి బెన్ స్టోక్స్ షాకిచ్చాడు.  ప్లేఆఫ్స్ కు ముందుగానే అతడు  చెన్నై క్యాంప్ ను వీడాడు. 

36
Image credit: PTI

ఒకవేళ  చెన్నై.. చెపాక్ లో గుజరాత్ ను ఓడిస్తే   అప్పుడు   నేరుగా ఐపీఎల్ - 16 ఫైనల్ ఆడొచ్చు.  ఈ నేపథ్యంలో  లీగ్ దశలో  గాయంతో విఫలమైన  స్టోక్స్.. ప్లేఆఫ్స్ లో అయినా ఆడతాడని ఆశించిన అభిమానులకు  అతడు షాకిచ్చాడు. 

46

ఈ సీజన్ కు ముందు  కొచ్చి  వేదికగా నిర్వహించిన వేలంలో  చెన్నై అతడిని రూ. 16.25 కోట్లు  వెచ్చించి దక్కించుకుంది.  కానీ  రూ. 20 లక్షలు తీసుకున్న ఆటగాడు  ఇచ్చిన ప్రదర్శన కూడా  స్టోక్స్ ఇవ్వలేదు.   ఈ సీజన్ లో ఫస్ట్ రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడిన స్టోక్స్..  15 పరుగులు మాత్రమే చేశాడు. రెండో మ్యాచ్ లో  బౌలింగ్ చేసి  రెండు ఓవర్లలో 18 పరుగులిచ్చాడు.   ఆ తర్వాత  వాంఖెడేలో ముంబైతో మ్యాచ్ కు ముందు గాయం కారణంగా మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టలేదు. 

56

ఇక ప్లేఆఫ్స్ కు ముందే  స్టోక్స్ లండన్ విమానమెక్కేశాడు.  ఇంగ్లాండ్ జట్టు.. జూన్ 1 నుంచి  ఐర్లాండ్ తో  ఏకైక టెస్టు ఆడనుంది.   ఈ టెస్టు కోసమే   స్టోక్స్.. చెన్నై క్యాంప్ ను వీడాడు.   ఈ మేరకు  సీఎస్కే కూడా తన అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.  

66
Image credit: Getty

అయితే ఐర్లాండ్ తో పాటు  వచ్చే నెల 16 నుంచి ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియాతో కీలక యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇందులో సన్నాహకాల్లో భాగంగానే   స్టోక్స్.. చెన్నై టీమ్ ను వీడాడు. తాను  టీమ్  తో  జాయిన్ అయినప్పుడే స్టోక్స్.. ప్లేఆఫ్స్  కు ముందే తాను వెళ్లిపోతానని టీమ్ మేనేజ్మెంట్ కు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే స్టోక్స్.. సీఎస్కే ఆఖరి లీగ్  మ్యాచ్ ముగిసిన తర్వాత  చెన్నైని వీడటం గమనార్హం.  

click me!

Recommended Stories