చచ్చేదాకా ఆడమంటారా... ధోనీ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్...

First Published May 29, 2023, 3:32 PM IST

పరుగు ఎక్కడ మొదలెట్టాలో కాదు, ఎక్కడ ఆపాలో కూడా తెలిసినవాడే గొప్పోడు. అందుకే శోభన్‌బాబు తన బయోగ్రఫీకి ‘పరుగు ఆపడం ఓ కళ’ అని టైటిల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ గురించి కూడా ఇదే చర్చ నడుస్తోంది...

2004లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 2019లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు..

అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత నాలుగు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ వస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2023 సీజన్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది..

Image credit: Sandeep Rana

సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ధోనీ రిటైర్మెంట్ గురించి ఎవరో ఒకరు ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. ఓసారి ఇది తనకి లాస్ట్ ఫేజ్ అని కామెంట్ చేసిన ధోనీ, ఇంకోసారి మీరే ఇది నా ఆఖరి ఐపీఎల్ సీజన్ అని చేసేశారంటూ వ్యాఖ్యానించాడు..

MS Dhoni

తాజాగా మాహీ రిటైర్మెంట్ గురించి భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘ధోనీ 15 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. అతని నుంచి మీకు ఇంకేం కావాలి. జీవితాంతం ఆడుతూనే ఉండమంటారా...

PTI PhotoManvender Vashist Lav)(PTI05_20_2023_000232B)

అది జరగని పని. 15 ఏళ్లుగా ఆడుతున్నందుకు అతనికి మనమంతా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అతను రేపు ఆడొచ్చు ఆడకపోవచ్చు, వచ్చే సీజన్‌లో ఆడొచ్చు, ఆడకపోవచ్చు... అతను ఆడినంత కాలం అద్భుతంగా ఆడాడు..
 

PTI PhotoR Senthil Kumar)(PTI05_10_2023_000319B)

ప్రతీదానికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు ఉంటుంది. అతను ఈ సీజన్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా టీమ్‌ని అద్భుతంగా నడిపించి ఫైనల్‌కి తీసుకొచ్చాడు. సీఎస్‌కే విజయంలో మాహీ పాత్ర ఎంతో ఉంది..

Dhoni

మిగిలిన ఆటల్లో కెప్టెన్‌కి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు కానీ క్రికెట్‌లో అలా కాదు. క్రికెట్‌లో ప్రతీ ప్లేయర్‌పై కెప్టెన్ ప్రభావం ఉంటుంది. ధోనీకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే...

MS Dhoni Ice Pack

ఏడాది మొత్తం ఆడితే ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఐపీఎల్ మాత్రమే ఆడే ప్లేయర్లకు ఇది చాలా కష్టం. ఈ విషయంలో ధోనీని మెచ్చుకోవాల్సిందే... 

MS Dhoni

క్రికెట్‌కి ధోనీ ఏం చేశాడో అభిమానులకు బాగా తెలుసు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పుకుంటాడు...

ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. చచ్చేదాకా ఆడుతూ ఉండడం ఎవ్వరి వల్లా కాదు. లెజెండరీ ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు మనమంతా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకానీ బాధపడకూడదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. 

click me!