ధోనీకి వర్షంతో ప్రత్యేక అనుబంధం... ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ వర్షం, రిజర్వు డే...

Published : May 28, 2023, 10:44 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. ఐపీఎల్ 15 సీజన్లలో ఎప్పుడూ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా నిలవకపోవడం విశేషం...  

PREV
17
ధోనీకి వర్షంతో ప్రత్యేక అనుబంధం... ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ వర్షం, రిజర్వు డే...
MS Dhoni

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మే 28న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం, వడగండ్ల వాన కారణంగా రిజర్వు డేకి మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..

27
PTI Photo/Manvender Vashist Lav)(PTI05_20_2023_000232B)

అనధికారంగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. యాదృచ్ఛికంగా మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి...

37

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగింది...

47
dhoni neesham

న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 239 పరుగులే చేయగలిగింది. 240 పరుగుల టార్గెట్‌తో  టీమిండియా బ్యాటింగ్ మొదలెట్టింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ని రిజర్వు డేకి వాయిదా వేశారు...

57

రిజర్వు డేలో మహేంద్ర సింగ్ ధోనీ 50 పరుగులు చేసి రనౌట్ కాగా రవీంద్ర జడేజా 77 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న ధోనీ, ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు...

67

ధోనీ ఆఖరి ఐపీఎల్ మ్యాచ్‌గా ప్రచారం జరుగుతున్న 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌‌కి కూడా వరుణుడి కారణంగా అంతరాయం కలగడం విశేషం. ఈ మ్యాచ్‌ కూడా రిజర్వు డేలోనే ఫలితం తేలేలా ఉంది.. 

77
India vs New Zealand

చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో ధోనీ టీమ్‌కి, టీమిండియాకి విజయం దక్కలేదు. మరి ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మాహీకి ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుందా? ఈసారి అయినా ధోనీకి ఘనమైన ఫేర్‌వెల్ దొరుకుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. 

Read more Photos on
click me!

Recommended Stories