కాఫీ ఆర్డర్ ఇచ్చా, అది వచ్చేలోపు బ్యాటింగ్‌కి వచ్చేశా... ఢిల్లీ బ్యాటింగ్‌పై అక్షర్ పటేల్ కాఫీ సిద్ధాంతం...

Published : Apr 25, 2023, 04:57 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. కేకేఆర్‌ని ఓడించి తొలి విజయం అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది...  

PREV
16
కాఫీ ఆర్డర్ ఇచ్చా, అది వచ్చేలోపు బ్యాటింగ్‌కి వచ్చేశా... ఢిల్లీ బ్యాటింగ్‌పై అక్షర్ పటేల్ కాఫీ సిద్ధాంతం...
SRH vs DC

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఒకే ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, ఆమన్ హాకీం ఖాన్ అవుట్ అయ్యారు. దీంతో ఈ ఓవర్ ఆరంభానికి ముందు 57/2 స్కోరుతో ఉన్న ఢిల్లీ టీమ్, ఓవర్ అయ్యేలోపు 62/5 కి చేరుకుంది...

26
PTI Photo/Vijay Verma) (PTI04_21_2023_000022B)

‘అసలు ఏం జరిగిందో నాకు కాసేపు అర్థం కాలేదు. నేను కాఫీ తాగుదామని ఆర్డర్ చేశాను. అది వచ్చేలోపు ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడ్డాయి.  వేడి వేడి కాఫీ కప్పుని అక్కడే వదిలేసి బ్యాటింగ్‌కి వచ్చాను. బ్యాటింగ్‌కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది...

36
Image credit: PTI

మనీశ్ పాండే, నేను కలిసి ఏంత ఎక్కువ సేపు వీలైతే అంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. భాగస్వామ్యం నిర్మిస్తే, మంచి స్కోరు చేయవచ్చని అనుకున్నాం. మా ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకూ హాట్ కాఫీ కాస్తా కూల్ కాఫీగా మారిపోయింది...
 

46

పిచ్ కాస్త స్లోగా ఉంది. బాల్ ఆగి వస్తోంది. కుల్దీప్, నేను కలిస్తే త్వరగా వికెట్లు తీయవచ్చని అనుకున్నా. అయిడిన్ మార్క్‌రమ్ వికెట్ నా ఫెవరెట్. అది కరెక్టుగా ఆడి ఉంటే బౌండరీ బయట పడి ఉండేది...  ’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్...

56
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000300B)

62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ని అక్షర్ పటేల్, మనీశ్ పాండే కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 59 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐదో వికెట్ పడగానే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని 15 ఓవర్లలోపే ఆలౌట్ చేస్తామని కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్...

66

అయితే ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా 144 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల చెత్త బ్యాటింగ్ కారణంగా 7 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అయితే ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. 

click me!

Recommended Stories