డేవిడ్ వార్నర్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ అందుకే వదులుకుంది... ఇర్పాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు...

First Published Apr 25, 2023, 4:07 PM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, కేకేఆర్ తర్వాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాదే. డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆరెంజ్ ఆర్మీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే వార్నర్‌తో పాటు ఆ క్రేజూ పోయింది...

2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న డేవిడ్ వార్నర్, 2016లో టీమ్‌కి మొట్టమొదటి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2017లో ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్, 2019, 20 సీజన్లలో కూడా వార్నర్ భాయ్ కెప్టెన్సీలోనే ప్లేఆఫ్స్‌కి వెళ్లింది...

కెప్టెన్‌గా టీమ్‌ని ముందుండి నడిపించిన డేవిడ్ వార్నర్, మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అంతేకాదు. 2016 సీజన్‌లో 848 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు...  విరాట్ కోహ్లీ ఆ సీజన్‌లో 973 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అయితే వార్నర్ చేసిన 848 పరుగులు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫైనల్ చేరేందుకు కీలకంగా మారాయి.

Latest Videos


సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో 7 సీజన్లు ఉంటే, ఆరు సీజన్లలో 500+ పరుగులు చేసి, బ్యాటింగ్‌లో ఇరగదీశాడు. మిడిల్ ఆర్డర్‌లో సరైన బ్యాటర్ లేకపోయినా, టీమ్‌లో ఒక్క భారత స్టార్ బ్యాటర్ లేకపోయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్ టీమ్స్‌లో ఒకటిగా నిలబడిందంటే దానికి డేవిడ్ వార్నరే కారణం..

అలాంటి 2021 సీజన్‌లో మొత్తం మారిపోయింది. ఆ సీజన్‌లో 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. దాంతో సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్, అతనికి తుది జట్టులో ప్లేస్ కూడా లేకుండా చేసింది. అసలు ఇంతకీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి?

‘సన్‌రైజర్స్ హైదరాబాద్, డేవిడ్ వార్నర్ మధ్య ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌ ఆ విషయాన్ని బయటపెట్టకుండా చాలా హుందాగా వ్యవహరిస్తోంది...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...

ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే, డేవిడ్ వార్నర్ ఏదో తప్పు చేశాడని, దాన్ని దాచిపెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని టీమ్ నుంచి తప్పించిందనే అర్థం వస్తోంది...

ఇన్నాళ్లు టీమ్ సెలక్షన్ గురించి డేవిడ్ వార్నర్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే, అతని కెప్టెన్సీ పోవడానికి కారణమని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ మాటలను చూస్తుంటే, వార్నర్ బయటికి పోవడానికి ఏదో పెద్ద కారణమనే ఉందని తెలుస్తోంది. మరి ఆ సీక్రెట్ ఎవరు బయటపెడతారో చూడాలి.. 

టీమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్లతో వ్యవహరించే విధానం గురించి కామెంట్లు చేశాడు డేవిడ్ వార్నర్. అతను మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? లేదా తాగి ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించాడా? ఇంకేదైనా తప్పు చేశాడు... ఇలా కనిపించి, కనిపించకుండా ఎక్స్‌ఫోజింగ్ చేసేకంటే... వార్నర్‌, సన్‌రైజర్స్ మధ్య ఏం జరిగిందో తెలుసన్న ఇర్ఫాన్ పఠాన్... ఆ విషయాన్ని పూర్తిగా బయటపెట్టాలని కోరుతున్నారు అభిమానులు.. 

click me!