ఓ వైపు తమ్ముడు, మరోవైపు బాయ్‌ఫ్రెండ్... సారా టెండూల్కర్ సపోర్ట్ ఏ టీమ్‌కి! సోషల్ మీడియాలో మీమ్స్...

Published : Apr 25, 2023, 04:31 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే మీమర్స్‌కి మాత్రం ఇది అర్జున్ టెండూల్కర్ వర్సెస్ శుబ్‌మన్ గిల్ మధ్యలో సారా టెండూల్కర్‌ మ్యాచ్‌గా కనిపిస్తోంది... 

PREV
16
ఓ వైపు తమ్ముడు, మరోవైపు బాయ్‌ఫ్రెండ్... సారా టెండూల్కర్ సపోర్ట్ ఏ టీమ్‌కి! సోషల్ మీడియాలో మీమ్స్...

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ చాలా రోజులుగా సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి తిరిగినట్టు ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాలేదు...

26

అయితే సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ వేర్వేరుగా షేర్ చేసిన ఫోటోలు, ఒకే లోకేషన్‌లో దిగినవని సోషల్ మీడియా ఇన్వెస్టిగేటర్లు సాక్ష్యాలతో నిరూపించారు. దీనంతటికీ కారణం అప్పుడెప్పుడో శుబ్‌మన్ గిల్‌పై సారా టెండూల్కర్ చేసిన కామెంట్...

36

కొన్నాళ్ల కిందట బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్‌తో కలిసి రెస్టారెంట్‌లో కనిపించాడు శుబ్‌మన్ గిల్. ఆ తర్వాత ఈ ఇద్దరూ ఓ హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చి, ఓ ఫ్లైట్‌లో వెళ్తున్న వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. దీంతో సారా టెండూల్కర్‌తో బ్రేకప్ చేసుకున్న శుబ్‌మన్ గిల్, సారా ఆలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...
 

46
PTI Photo/Kunal Patil)(PTI04_22_2023_000465B)

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు సారా టెండూల్కర్ తమ్ముడు అర్జున్ టెండూల్కర్. గత మూడు మ్యాచుల్లోనూ ఓపెనింగ్ ఓవర్ వేసింది అర్జునే. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ఏకంగా 31 పరుగులు సమర్పించాడు..

56
Arjun Tendulkar Sara Tendulkar Shubman Gill

దీంతో నేటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కి, ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వేయడం దాదాపు ఖాయమే. దీంతో స్టేడియానికి వచ్చే సారా టెండూల్కర్ తమ్ముడికి సపోర్ట్ చేస్తుందా? లేక బాయ్‌ఫ్రెండ్‌కా (రూమర్స్)? అని మీమ్స్ వైరల్ చేస్తున్నారు ఇన్‌స్టా జనాలు...
 

66

శుబ్‌మన్ గిల్ లేటెస్ట్ గర్ల్‌ఫ్రెండ్ సారా ఆలీ ఖాన్ కూడా ఈ మ్యాచ్ చూడడానికి స్టేడియాకి వస్తే.. ఇద్దరు సారాల మధ్య అర్జున్, శుబ్‌మన్ గిల్ ఫైట్.. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా క్లైమాక్స్‌ని తలపిస్తుందని తమ క్రియేటివిటీ జోడించి వీడియోలు కూడా చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

Read more Photos on
click me!

Recommended Stories