ఐపీఎల్ -16 మొదలై నెల.. ఎవరి పరిస్థితి ఏంటి..? టాప్ టు బాటమ్ అప్డేట్స్

Published : May 01, 2023, 11:00 AM IST

IPL 2023: మూడేండ్ల తర్వాత  మళ్లీ  ప్రేక్షకుల నడుమ అంగరంగ వైభవంగా మొదలైన  ఇండయన్ ప్రీమియర్ లీగ్ -16  ఎడిషన్  రెండో దశకు చేరింది. 

PREV
19
ఐపీఎల్ -16 మొదలై నెల.. ఎవరి పరిస్థితి ఏంటి..? టాప్ టు బాటమ్ అప్డేట్స్

కరోనా కారణంగా గడిచిన మూడేండ్ల పాటు బయో బబుల్స్, పరిమిత వేదికలు,  ఎన్నో ఆంక్షలు, మరెన్నో నిబంధనల మధ్య  కొత్త వెలుగులా ఐపీఎల్ -16 మొదలైంది. గత నెల 31న  అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం (నరేంద్ర మోడీ  క్రికెట్ స్టేడియం)లో మొదలైన  ఈ లీగ్..  నెల రోజులు పూర్తి చేసుకుంది.  

29

రెండు నెలల పాటు సాగే ఈ లీగ్ లో   ఇప్పటికే ఒక అంకం ముగిసింది.  మొత్తం 74 (లీగ్ 70, ప్లేఆఫ్స్ 4) మ్యాచ్ లు ఉన్న ఈ  సీజన్ లో  ఆదివారం ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య  42వ మ్యాచ్ ముగిసింది.  మ్యాచ్ ల పరంగా సగం అంకం ఇప్పటికే ముగియగా  కాల పరిమితి పరంగా మాత్రం  మరో నెల రోజులు గడువుండటంతో నేటికి అది సగం పూర్తయింది. మే 28న  అహ్మదాబాద్ లో ఐపీఎల్ -16 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. 

39
Image credit: PTI

అయితే ఈ సీజన్ లో   ఇప్పటివరకు దాదాపు అన్ని జట్లు 8 మ్యాచ్ లు (మొత్తం ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు)  ఆడాయి. చెన్నై, పంజాబ్, రాజస్తాన్, కేకేఆర్ లు 9 మ్యాచ్ లు  పూర్తి చేసుకున్నాయి.   ఇక నుంచి  ప్రతీ జట్టు ఆడే మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకం కానుంది. 

49

ముంబై - రాజస్తాన్ మ్యాచ్ ముగిసేటప్పటికీ ఐపీఎల్ - 16లో పాయింట్ల పట్టిక ఇలా  ఉంది.  8 మ్యాచ్ లు ఆడి గుజరాత్ టైటాన్స్ .. 6 గెలిచి రెండు మాత్రమే ఓడి  12 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.  

59

లక్నో కూడా  8 మ్యాచ్ లు ఆడి  ఐదింటిలో గెలిచి మూడు ఓడి 10 పాయింట్లతో నెంబర్ 2 దక్కించుకుంది.  రాజస్తాన్, చెన్నైలు  9 మ్యాచ్ లు ఆడి 5 గెలిచి నాలుగింటిలో ఓడి  తలా 10 పాయింట్లతో  3, 4  స్థానాల్లో ఉన్నాయి.  పంజాబ్ కింగ్స్ కూడా  9 మ్యాచ్ లలో ఐదు గెలిచి  నాలుగు ఓడి 10 పాయింట్లతోనే ఉంది. కానీ నెట్ రన్ రేట్ విషయంలో  లక్నో కు కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. 

69

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు   8  మ్యాచ్ లలో  నాలుగు గెలిచి నాలుగు ఓడి  8 పాయింట్లతో  ఆరో స్థానంలో ఉంది.  ముంబై ఇండియన్స్ కూడా ఇవే గణాంకాలతో  ఏడో స్థానంలో నిలిచింది.  ఆర్సీబీ నెట్ రన్ రేట్  ముంబై కంటే కాస్త మెరుగ్గా ఉంది. కానీ రెండూ  మైనస్ లోనే ఉన్నాయి.

79
Image credit: PTI

8వ స్థానంలో కోల్కతా నైట్  రైడర్స్.. 9 మ్యాచ్ లు ఆడి  మూడు మాత్రమే గెలిచి  ఆరింట్లో ఓడింది. కేకేఆర్ కు 6 పాయింట్లు ఉన్నాయి.  సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్ లు ఆడి  3 గెలిచి ఐదు ఓడింది.  కేకేఆర్, సన్ రైజర్స్ కు ఆరు పాయింట్లు ఉన్నా  నెట్ రన్ రేట్ లో కోల్కతా ముందుంది. 

89
Image credit: PTI

కాగా టేబుల్ బాటమ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు  మ్యాచ్ లే గెలిచి ఆరింట్లో ఓడింది.  ఈ క్రమంలో దానికి 4 పాయింట్లే వచ్చాయి. రాబోయే  ఆరు మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడినా ఢిల్లీ ఈ లీగ్ నుంచి అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్టే అవుతుంది. 

99

ఇక ప్లేఆఫ్స్ రేసులో  టాప్ -6 జట్ల (గుజరాత్, లక్నో, రాజస్తాన్, చెన్నై, పంజాబ్, ఆర్సీబీ) మధ్య హోరోహోరి పోరు జరుగుతోంది.  గత సీజన్ లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన చెన్నై ఈసారి  ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ రాబోయే మ్యాచ్ లలో ఆ జట్టు  ఆడే ఆటతీరు మీద ఆధారపడి ఉంటుంది. గుజరాత్, రాజస్తాన్, లక్నో కూడా ఈ రేసులో ముందుకు దూసుకెళ్తున్నాయి.  ఇప్పుడున్న పాయింట్ల పట్టిక ప్రకారం అయితే పంజాబ్, ఆర్సీబీ, ముంబైలకు కూడా ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జట్ల  ప్రదర్శనను బట్టి చూస్తే  కేకేఆర్, సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లు మాత్రం ప్లేఆఫ్స్ కు చేరుకోవడం కలే అవుతుంది.  

click me!

Recommended Stories