ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత వారం రోజుల గ్యాప్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్నాయి ఇండియా, ఆస్ట్రేలియా. ఇది ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టూర్‌లో యాషెస్ సిరీస్ ఆడుతుంది..
బిజీ షెడ్యూల్ కారణంగా ఆస్ట్రేలియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఐపీఎల్ 2023 మినీ వేలంలో పేరు రిజిస్టర్ చేసుకోలేదు..
28
Josh Hazlewood
స్టీవ్ స్మిత్‌తో పాటు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్ వంటి ప్లేయర్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశారు. కామెరూన్ గ్రీన్, జోష్ హజల్‌వుడ్, డేవిడ్ వార్నర్ వంటి కొంత మంది ఆసీస్ టెస్టు ప్లేయర్లు మాత్రమే ఐపీఎల్ 2023 ఆడుతున్నారు..
38
Josh Hazlewood
గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 8 మ్యాచులకు దూరంగా ఉన్న జోష్ హజల్‌వుడ్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. 3 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు..
48
‘జోష్ హజల్‌వుడ్, ఐపీఎల్ ఎందుకు ఆడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్లు అందరూ టెస్టు మ్యాచ్ క్రికెట్ కోసం ప్రిపేర్ అవుతుంటే, జోష్ హజల్‌వుడ్ మాత్రం ఇక్కడ ఉన్నాడు..
58
నెట్స్‌లో జోష్ హజల్‌వుడ్, మిగిలిన ఐపీఎల్ ప్లేయర్ల కంటే ఎక్కువగా బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టు మ్యాచ్ క్రికెట్ ప్రాక్టీస్ కోసమేనా ఇదంతా. ఇది ఎవరికి ఉపయోగపడతుంది..
68
Image : PTI
వీళ్లు ఐపీఎల్ ఆడకుండా ఉండలేకపోతున్నారు. ఇండియాకి నో చెప్పడానికి ధైర్యం రావడం లేదు. ఎవ్వరూ కూడా ఐపీఎల్ ఆడకుండా ఉండలేకపోతున్నారు. కామెరూన్ గ్రీన్‌తో ఈ విషయం మాట్లాడాను..
78
Image credit: PTI
అతను ఐపీఎల్ ఆడతానని చెప్పాడు. యాషెస్ సిరీస్ వస్తోంది, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉందని చెప్పినా, ఐపీఎల్‌లో ఆడడానికే ఇంట్రెస్ట్ చూపించాడు. ఐపీఎల్‌లో ఆడి అలిసిపోవడం కంటే ఈ నాలుగు వారాలు రెస్ట్ తీసుకుని, టెస్టు క్రికెట్‌కి ప్రిపేర్ అవ్వొచ్చు కదా..
88
(PTI Photo)(PTI04_18_2023_000253B)
ఐపీఎల్ ద్వారా కోట్లకు కోట్లు వస్తున్నాయి, ఇక్కడే ఉండండి అంత డబ్బులు మేం ఇస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఆఫర్ ఇస్తే తప్ప, ఈ ప్లేయర్లను అక్కడికి వెళ్లకుండా ఆపలేం అనుకుంటా...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్..