ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచుల్లో మెజారిటీ శాతం లాస్ట్ ఓవర్ దాకా సాగుతున్నాయి. భారీ స్కోరింగ్ గేమ్స్ అయినా లో స్కోరింగ్ మ్యాచులు అయినా లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా వెళ్లడం కామన్ అయిపోయింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్లింది..
టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్, లాస్ట్ పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిల్స్‌ని ఈజీగా ఓడిస్తుందని అనుకున్నారంతా. అదీకాకుండా టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్, 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాతే సీన్ మారింది..
28
Image credit: PTI
ఆమన్ హకీం ఖాన్, అక్షర్ పటేల్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ 130 పరుగులు చేయగలిగింది. అయితే శుబ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్ వంటి భారీ మిట్టర్లు ఉన్న గుజరాత్ టైటాన్స్ ఈ లక్ష్యాన్ని 10 ఓవర్లలో ఊదేస్తుందని అనుకున్నారంతా. అయితే ఇక్కడ రిజల్ట్ తేడా కొట్టింది...
38
Ishant Sharma
అదిరిపోయే బౌలింగ్‌తో గుజరాత్ టైటాన్స్‌ని 125 పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. చివరి 9 బంతుల్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 30 పరుగులు కావాల్సి రాగా రాహుల్ తెవాటియా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు..
ఒక్కసారి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వైపు మళ్లింది. 6 బంతుల్లో 12 పరుగులే కావాల్సి రావడంతో గుజరాత్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే ఊహించని విధంగా రాహుల్ తెవాటియాని అవుట్ చేసిన ఇషాంత్ శర్మ చివరి ఓవర్‌లో 6 పరుగులే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 పరుగుల తేడాతో గెలిచింది..
58
PTI Photo) (PTI05_02_2023_000393B)
‘రాహుల్ తెవాటియాతో కలిసి నేను చాలా క్రికెట్ ఆడాను. నా ముందు నువ్వో పిల్ల బచ్చావని వాడిని ఆటపట్టిస్తూ ఉంటాను. అతన్ని ఎలా అవుట్ చేయాలో నాకు బాగా తెలుసు. తెవాటియా వికెట్ తీయకపోతే మ్యాచ్‌ని 2 బంతుల్లో ముగించేస్తాడు...
68
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000405B)
నేను ఆటకు ఎప్పుడూ దూరం కాలేదు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. వైడ్ యార్కర్లు వేసేందుకు శ్రమిస్తూనే ఉన్నా. ఈ మ్యాచ్‌లో ఆ ప్రాక్టీస్ ఉపయోగపడింది. ఏ బ్యాటర్‌కి ఎలా బౌలింగ్ వేయాలో తెలిస్తే వికెట్ తీయడం పెద్ద కష్టమేమీ కాదు..’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఇషాంత్ శర్మ..
78
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపికైన జయ్‌దేవ్ ఉనద్కట్ గాయపడ్డాడు. అతను ఎప్పుడు కోలుకుంటాడనే విషయంలో క్లారిటీ రాలేదు. అలాగే ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో సతమతమవుతున్నాడు.
88
ఈ ఇద్దరూ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దూరం అయితే మరోసారి సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు టెస్టుల్లో అవకాశం రావచ్చు. 100 టెస్టులకు పైగా ఆడిన అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ, ఫిట్‌గా ఉంటే టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అవుతాడు.