కృనాల్ పాండ్యా శెకలు మామూలుగా లేవుగా! ధోనీనే వెయిట్ చేయించి, దీపక్ హుడాని తప్పించి..

First Published May 3, 2023, 6:39 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ కెప్టెన్లుగా మారారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా గత సీజన్‌లో టైటిల్ గెలవగా, కెఎల్ రాహుల్ గాయపడడంతో లక్నో సూపర్ జెయింట్స్‌కి కృనాల్ పాండ్యా తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు..

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ ఆపేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్ తొడ కండరాలు పట్టుకోవడంతో ఫిజియో సాయంతో డగౌట్ చేరాడు. 9వ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చినా ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు..

కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండు మూడు వారాల సమయం పడుతుందని సమాచారం. అదే నిజమైతే కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోనే మిగిలిన మ్యాచులన్నీ ఆడాల్సి ఉంటుంది లక్నో సూపర్ జెయింట్స్..
 

Latest Videos



సాధారణంగానే కృనాల్ పాండ్యా ప్రతీదానికి కాస్త ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. బౌలింగ్ చేసినా, క్యాచ్ పట్టినా, సిక్సర్ కొట్టనా, ఆఖరికి క్యాచ్ డ్రాప్ చేసినా కృనాల్ పాండ్యా చేసే ఓవరాక్షన్ గురించి మీమ్స్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి...

తాత్కాలిక సారథిగా బాధ్యతలు అందుకున్న కృనాల్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ధోనీని ఎదురుచూసేలా చేశాడు. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ధోనీతో పాటు రిఫరీ మైదానంలోకి చేరుకున్నా, కృనాల్ పాండ్యా మాత్రం చాలా తీరిగ్గా వచ్చాడు..

రాగానే అతి వినయం చూపిస్తూ, వంగి మరీ ధోనీకి నమస్కారాలు చేశాడు కృనాల్ పాండ్యా. ఇదంతా పక్కనబెడితే సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీపక్ హుడాని టీమ్ నుంచి తప్పించడం హాట్ టాపిక్ అయ్యింది... దీపక్ హుడా ఈ సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు..

PTI PhotoAtul Yadav)(PTI04_22_2023_000247B)

ఫామ్‌లో లేని దీపక్ హుడాని టీమ్ నుంచి తప్పించడం పెద్ద తప్పిదం ఏం కాకపోయినా కృనాల్ పాండ్యా కెప్టెన్‌ కాగానే అతనికి తుది జట్టులో చోటు పోవడంతో అనుమానాలు రేగుతున్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. 

Image credit: PTI

సయ్యద్ ముస్తాక్ ఆలీ 2020 సమయంలో కృనాల్ పాండ్యా కెప్టెన్సీలో ఆడలేనని దీపక్ హుడా, బరోడా టీమ్ నుంచి తప్పుకున్నాడు కూడా. బరోడా క్రికెట్ బోర్డు, దీపక్ హుడాపై ఏడాది బ్యాన్ కూడా వేసింది. ఆ ఎపిసోడ్ తర్వాత ఇద్దరూ లక్నో టీమ్‌ తరుపున కలిసి ఆడుతున్నారు.

కెప్టెన్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు కృనాల్. అయితే ఆయుష్ బదోనీ హాఫ్ సెంచరీ చేసి రాణించడంతో లక్నో స్కోరు 120+ స్కోరు దాటింది.. 

click me!