గెలిచాం సరే, ఇలాంటి చెత్త ఫీల్డింగ్‌తో కనీసం ప్లేఆఫ్స్‌కైనా వెళ్లగలమా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై...

Published : Apr 15, 2023, 12:01 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ని వరుసగా రెండు ఓటములతో ప్రారంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన తర్వాత పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో నెగ్గింది...

PREV
110
గెలిచాం సరే, ఇలాంటి చెత్త ఫీల్డింగ్‌తో కనీసం ప్లేఆఫ్స్‌కైనా వెళ్లగలమా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై...
Image credit: PTI

హారీ బ్రూక్ అద్భుత సెంచరీతో అజేయంగా నిలవగా కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు, అభిషేక్ శర్మ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి మెప్పించడంతో 228 పరుగుల భారీ స్కోరు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

210

ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత ఏ టీమ్ అయినా ఓడిపోతామని భయపడడం చాలా అరుదు. అందులోనూ భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మర్కండే, వాషింగ్టన్ సుందర్ వంటి టాప్ క్లాస్ బౌలింగ్ యూనిట్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం. అయితే ఆరెంజ్ ఆర్మీని చివరి ఓవర్ వరకూ కంగారు పెట్టింది కేకేఆర్..

310

కెప్టెన్ నితీశ్ రాణాతో పాటు నారాయణ్ జగదీశన్, రింకూ సింగ్... హైదరాబాద్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఆఖరి వరకూ పోరాడారు. అయితే కేకేఆర్ బ్యాటర్ల ఆట కంటే ఎక్కువగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలే.. మ్యాచ్ చివరి వరకూ సాగడానికి కారణమయ్యాయి...

410

కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒకటి రెండూ కాదు, ఏకంగా ఆరు డ్రాప్ క్యాచ్‌లు ఉండడం విశేషం. మిస్ ఫీల్డింగ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈజీగా ఆపాల్సిన బంతిని కూడా ఆపలేక దాదాపు 20-25 పరుగులు అదనంగా ఇచ్చేశారు హైదారాబాద్ ఫీల్డర్లు...

510
Image credit: PTI

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఎన్ జగదీశన్ ఇచ్చిన క్యాచ్‌ని బౌలర్ భువీ అందుకోలేకపోయాడు. అప్పటికే జగదీశన్ స్కోరు 8 పరుగులే. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో మయాంక్ మర్కండే బౌలింగ్‌లో జగదీశన్ ఇచ్చిన క్యాచ్‌ని రాహుల్ త్రిపాఠి జారవిడిచాడు. అప్పటికి అతని స్కోరు 25 పరుగులు...

610
(PTI Photo/Swapan Mahapatra)(PTI04_14_2023_000342B)

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఎన్ జగదీశన్ ఇచ్చిన క్యాచ్‌ని బౌలర్ భువీ అందుకోలేకపోయాడు. అప్పటికే జగదీశన్ స్కోరు 8 పరుగులే. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో మయాంక్ మర్కండే బౌలింగ్‌లో జగదీశన్ ఇచ్చిన క్యాచ్‌ని రాహుల్ త్రిపాఠి జారవిడిచాడు. అప్పటికి అతని స్కోరు 25 పరుగులు...

710

అలా రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో నితీశ్ రాణా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని వాషింగ్టన్ సుందర్ నేల పాలు చేశాడు...

810

ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ ఇచ్చిన క్యాచ్‌ని కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ అందుకోలేకపోయాడు. నటరాజన్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ని డ్రాప్ చేసిన గ్లెన్ ఫిలిప్స్, బౌండరీ కూడా సమర్పించేశాడు..
 

910

ఇలా వచ్చిన క్యాచులను ఒడిసి పట్టుకుని ఉంటే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ స్కోరు మహా అయితే 160+ కూడా దాటేది కాదు. భారీ స్కోరింగ్ గేమ్ కాబట్టి ఎలాగోలా గెలిచేసింది కానీ ఇలాంటి ఫీల్డింగ్ ప్రమాణాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్స్ చేరడం కూడా కష్టమే... 

1010
SRH

ఎందుకంటే హారీ బ్రూక్ సెంచరీతో పాటు దాదాపు అభిషేక్ శర్మ, అయిడిన్ మార్క్‌రమ్ బౌండరీలు బాదడంతో ఇంత భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 160-180+ స్కోరు ఛేదించాల్సి వస్తే ఎలా బ్యాటింగ్ చేస్తుందో చెప్పడం కష్టం.

click me!

Recommended Stories