తిలక్ వర్మపై ప్రశంసలు.. ముంబై బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారిన తెలుగు కుర్రాడు

Published : Apr 12, 2023, 03:49 PM IST

IPL 2023: ఐపీఎల్ లో  ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై  ప్రశంసలు కురుస్తున్నాయి.  నిలకడగా రాణిస్తున్న తిలక్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 

PREV
16
తిలక్  వర్మపై ప్రశంసలు.. ముంబై బ్యాటింగ్‌కు  వెన్నెముకగా మారిన తెలుగు  కుర్రాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  ముంబై ఇండియన్స్ కు  ఘనమైన చరిత్ర ఉంది.  ఈ లీగ్ లో  అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ఈ ఫ్రాంచైజీకి  సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్ వంటి మునపటి తరం ఆటగాళ్లే గాక    రోహిత్ శర్మ వంటి  ఈ తరం దిగ్గజాలు కూడా పనిచేశారు.  

26

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ లో రోహిత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ బ్యాటర్లు కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి  విధ్వంసక ఆటగాళ్లు ఉన్నా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వారిలో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 
 

36

2022 సీజన్ లో ముంబై తరఫున  ఎంట్రీ ఇచ్చిన  తిలక్ వర్మ.. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. గత సీజన్ లో ముంబై బ్యాటర్లు  ఇషాన్, రోహిత్, సూర్య లు విఫలమైన చోట తిలక్ రాణించాడు.  2022 సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి  397 రన్స్ చేశాడు.  ఇందులో  2 హాఫ్  సెంచరీలు కూడా ఉన్నాయి.  

46

ఇక ఈ ఏడాది కూడా తిలక్ తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో  ముంబై.. ఆర్సీబీతో ఆడిన తొలి మ్యాచ్ లో  టాపార్డర్ విఫలమైన చోట అతడు దుమ్మురేపాడు. బెంగళూరుతో 46 బంతుల్లోనే 84 రన్స్ చేసిన తిలక్..  చెన్నైతో మ్యాచ్ లో కూడా 22 రన్స్ చేశాడు. ఇక మంగళవారం ఢిల్లీ క్యాపటల్స్ తో జరిగిన మ్యాచ్ లో  29 బంతుల్లోనే 41 రన్స్ చేశాడు.  ఈ సీజన్ లో  ముంబై  తరఫున హయ్యస్ట్ రన్ స్కోరర్ (147)  కూడా  అతడే. 

56

ఢిల్లీతో మ్యాచ్ లో తిలక్ వర్మ.. ముఖేష్ కుమార్ వేసిన 16 వ ఓవ్రలో  వరుసగా రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ బాది  ముంబైని విజయానికి దగ్గర చేశాడు.  వరుసగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న తిలక్ వర్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు త్వరలోనే  టీమిండియాకు ఆడతాడని అంటున్నారు. 
 

66

గత సీజన్ తర్వాత టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా ఇదే  అభిప్రాయం వ్యక్తం చేశాడు. తిలక్ వర్మ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని  ప్రశంసలు కురిపించాడు.  ఇక నిన్న ఢిల్లీతో మ్యాచ్ ముగిశాక  ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే   కూడా తిలక్  గురించి స్పందిస్తూ.. ‘బ్యాటింగ్ కు కష్టంగా  ఉన్న పిచ్ పై తిలక్ వర్మ ఆట  సూపర్. అతడు ముంబైకి దొరికిన విలువైన ఆస్తి..’అని  ట్విటర్ వేదికగా అభినందించాడు. 

click me!

Recommended Stories