అగమ్యగోచరంగా ముంబై ఇండియన్స్ పరిస్థితి... ఎవరొస్తారా అని పక్క టీమ్స్‌వైపు చూస్తున్న రోహిత్ సేన...

First Published May 29, 2023, 5:53 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అంచనాలకు మించి రాణించింది. సరైన ఫాస్ట్ బౌలర్ లేకపోయినా, అదరగొడతాడని ఆశపడిన జోఫ్రా ఆర్చర్ గాయంతో మధ్యలోనే తప్పుకున్నా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆడింది...

PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000280B)

కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, ఆకాశ్ మద్వాల్, జాసన్ బెహ్రాడార్ఫ్, పియూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, రిలే మెడరిత్, క్రిస్ జోర్డాన్ వంటి బేస్ ప్రైజ్ ప్లేయర్లతోనే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ దాకా వెళ్లగలిగింది ముంబై ఇండియన్స్... సరైన ఒక్క బౌలర్ ఉండి ఉంటే, పరిస్థితి ఇంకోలా ఉండేది... 

Image credit: PTI

బౌలింగ్ పేలవంగా ఉన్నా ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, నేహాల్ మద్వాల్, రోహిత్ వర్మ వంటి బ్యాటర్ల కారణంగా విజయాలు అందుకోగలిగింది ముంబై ఇండియన్స్...
 

PTI PhotoKunal Patil) (PTI05_26_2023_000308B)

ఐపీఎల్ 2022 మెగా వేలంలో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించని ముంబై ఇండియన్స్, దానికి రెండు సీజన్లలో భారీ మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం పూర్తిగా బలహీనపడింది..

Mumbai Indians

జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ ఆడతారు, ముంబైని గెలిపిస్తారని ఆశపడిన రోహిత్ సేనకు నిరాశే ఎదురైంది. ఆర్చర్ రెండు సీజన్లలో కలిసి 5 మ్యాచులు ఆడి రెండే వికెట్లు తీస్తే వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ప్రిత్ బుమ్రా, 2023 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు...

ఇప్పుడు మళ్లీ వచ్చే సీజన్‌లో ఈ ఇద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, టీమ్‌కి అందుబాటులో ఉంటారని ఎదురుచూస్తూ కూర్చుంటే ముంబై ఇండియన్స్ మరోసారి భారీ మూల్యం చెల్లించక తప్పదు. దీంతో ముంబై  ఇండియన్స్, ఐపీఎల్ 2024 వేలంపై పూర్తి ఫోకస్ పెట్టింది..

Image credit: PTI

బేస్ ప్రైజ్ బౌలర్లను అలాగే అట్టి పెట్టుకుని, కామెరూన్ గ్రీన్ వంటి భారీ ధర పోసి కొనుక్కున్న ఆల్‌రౌండర్‌ని వేలానికి వదిలేయాలని ముంబై ఇండియన్స్ ఆలోచిస్తున్నట్టు సమాచారం..

PTI PhotoKunal Patil)(PTI05_12_2023_000277B)

కామెరూన్ గ్రీన్‌ని రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. దీంతో అతన్ని వేలానికి వదిలేస్తే ఇద్దరు స్టార్ బౌలర్లను కొనుగోలు చేయవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు సమచారం..

PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000212B)

అయితే ముంబై ఇండియన్స్ బౌలింగ్ మళ్లీ పటిష్టంగా మారాలంటే మిగిలిన టీమ్స్‌లో ఉన్న బౌలర్లు 2024 మినీ వేలంలో పాల్గొనాలి. అప్పుడే ముంబై ఇండియన్స్ వారిని కొనుగోలు చేయగలుగుతుంది. దీంతో ఏ టీమ్ నుంచి ఏ బౌలర్ బయటికి వస్తాడా? అని ముంబై ఇండియన్స్ ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి... 

PTI PhotoR Senthil Kumar) (PTI05_24_2023_000321B)

‘ఇద్దరు స్టార్ ప్లేయర్లను కోల్పోయాం. ఇది టీమ్‌‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. జట్టులో ఖాళీలను నింపేందుకు మేం ఎంతగానో ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు... ఏ టీమ్‌కైనా ఆర్చర్, బుమ్రా వంటి ఇద్దరు కీ ప్లేయర్లు లేకుండా గెలవడం కష్టం.

(PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000281B)

ఈ ఇద్దరూ వచ్చే సీజన్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని అనుకుంటున్నాం. అలా జరగకపోతే వారికి రిప్లేస్‌మెంట్‌గా ప్లేయర్లను వెతకాల్సి ఉంటుంది.. ’ అంటూ  కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్. 

click me!