ముంబై ఇండియన్స్ స్టార్లనే కొంటుంది, అందుకే నాకు సీఎస్‌కే ఇష్టం... హార్ధిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు..

Published : May 06, 2023, 08:30 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడి, టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో హార్ధిక్ పాండ్యా ఒకడు. హార్ధిక్ అన్న కృనాల్ పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, రాహుల్ చాహార్.. ఇలా అరడజనుకి పైగా ప్లేయర్లు, ముంబై ద్వారా టీమిండియాలోకి వచ్చారు, స్టార్లుగా ఎదిగారు..

PREV
18
ముంబై ఇండియన్స్ స్టార్లనే కొంటుంది, అందుకే నాకు సీఎస్‌కే ఇష్టం...  హార్ధిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు..

బరోడాకి ఆడిన హార్ధిక్ పాండ్యాని రూ.10 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, అతన్ని తిరుగులేని ఆల్‌రౌండర్‌గా మార్చింది. రిటైన్ చేసుకున్న తర్వాత 2018 నుంచి 2021 మధ్యకాలంలో ఏటా రూ.11 కోట్లు చెల్లించింది...
 

28
Image credit: Getty

ఐపీఎల్ 2022 మెగా వేలం సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కిరన్ పోలార్డ్,జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, మరో దారి లేక హార్ధిక్ పాండ్యాని వేలానికి వదిలేసింది. అయితే దీన్ని హార్ధిక్ పాండ్యా చాలా సీరియస్‌గా తీసుకున్నాడు..
 

38
Hardik Pandya

ముంబై ఇండియన్స్‌ రిటైన్ చేసుకోకపోవడంతో రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా మారిన హార్ధిక్ పాండ్యా, 2022 సీజన్‌లో టైటిల్ కూడా గెలిచాడు. 2022 ఐపీఎల్ టైటల్ గెలవడంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్ కూడా పొందిన హార్ధిక్ పాండ్యా యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది...

48
Image credit: PTI

‘ఐపీఎల్‌లో సక్సెస్ కావడానికి రెండు దారులు ఉంటాయి. మొదటిది ఉన్నదాంట్లో బెస్ట్ ప్లేయర్లను కొనుగోలు చేసి, వారితో ఆడి గెలవడం. ముంబై ఇండియన్స్ అలాగే గెలుస్తుంది.. మేం అలాగే గెలుస్తూ వచ్చాం...

58

రెండోది మంచి వాతావరణం నిర్మించి, ప్లేయర్ల నుంచి బెస్ట్ రాబట్టి గెలవడం. ఇది చెన్నై సూపర్ కింగ్స్ చేస్తుంది. ప్లేయర్లు ఎవ్వరైనా సరే, వాళ్లు అక్కడ అదరగొడతారు..

68

అందుకే నా బెస్ట్ ప్లేయర్లను కొనే ముంబై ఇండియన్స్ కంటే ప్లేయర్ల నుంచి బెస్ట్ రాబట్టే చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే ఇష్టం. నేను కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నా. బెస్ట్ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నా.. ’ అంటూ రాబిన్ ఊతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా..

78

హార్ధిక్ పాండ్యా కామెంట్లపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఓ అనామక ప్లేయర్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాని స్టార్‌గా మలిచిన ముంబై ఇండియన్స్ టీమ్‌ని ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. 

88

ముంబై ఇండియన్స్‌లోకి రాకముందు తానేంటో హర్ధిక్ పాండ్యా మరిచిపోయాడని, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్క టైటిల్ గెలవగానే అతనికి కొమ్ములు వచ్చి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు.. 

click me!

Recommended Stories