నాకు అతని ఆటంటే చాలా ఇష్టం! ఫైనల్‌లో అదరగొడతాడు... సౌరవ్ గంగూలీ కామెంట్స్..

Published : May 06, 2023, 07:25 PM IST

ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్ ద్వారా మూడేళ్ల తర్వాత దినేశ్ కార్తీక్, టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తే... ఐపీఎల్ 2023 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా అజింకా రహానేకి 17 నెలల తర్వాత భారత జట్టులో చోటు దక్కింది. శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో రహానే, ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం దాదాపు ఖాయమైపోయింది..  

PREV
17
నాకు అతని ఆటంటే చాలా ఇష్టం! ఫైనల్‌లో అదరగొడతాడు... సౌరవ్ గంగూలీ కామెంట్స్..

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అదరగొడుతున్న అజింకా రహానే, రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో 57.63 యావరేజ్‌తో 634 పరుగులు చేశాడు.. రహానేని తిరిగి టీమిండియాకి సెలక్ట్ చేయడానికి రంజీ పర్ఫామెన్స్ కూడా కారణం.. 
 

27

17 నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన భారత టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానేపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

37
Ajinkya Rahane


‘అజింకా రహానే చాలా కూల్ అండ్ కామ్ పర్సన్. అతనంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. టీమిండియాకి అతను ఎప్పుడూ మంచి ప్లేయర్‌గా ఉంటూ వచ్చాడు...

47
PTI Photo) (PTI04_27_2023_000372B)

అవకాశాలు ఎప్పుడూ తలుపు తట్టవు. తట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో రహానే ముందుంటాడు. నాకు తెలిసి అజింకా రహానేకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో తప్పక చోటు ఉంటుంది..

57
Image credit: PTI

అతను ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుని, టీమ్‌లో మళ్లీ సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కెఎల్ రాహుల్ గాయం గురించి తెలిసి చాలా బాధేసింది. ప్రతీ ఆటలో గాయాలు సహజం..

67

ఎన్నో ఏళ్లుగా వీళ్లు టీమ్‌కి ఆడుతున్నారు. మూడు ఫార్మాట్లు వచ్చాక క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ప్లేయర్లు గాయపడే ఛాన్సులు పెరిగిపోయాయి. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా..

77
Ponting-Ganguly

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ హెడ్‌గా నా బాధ్యతలను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. ఆఖరి 5 మ్యాచుల్లో మేం మూడింట్లో గెలిచాం. ఇంకా ఐదు మ్యాచులు ఉన్నాయి. ఆ మ్యాచులు గెలిస్తే ఏమైనా జరగొచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ..

click me!

Recommended Stories