33 వేల మంది ఫ్యాన్స్, ప్రతీ సీటులోనూ సచిన్... వాంఖడేలో టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌...

Published : Apr 22, 2023, 11:56 AM IST

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన సచిన్ టెండూల్కర్, క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. అయితే ఇప్పటికీ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు..  

PREV
17
33 వేల మంది ఫ్యాన్స్,  ప్రతీ సీటులోనూ సచిన్... వాంఖడేలో టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌...
Sachin Tendulkar

మిగిలిన ప్లేయర్లు కలలో కూడా ఊహించనన్ని పరుగులు, మ్యాచులు, బౌండరీలు, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు సాధించాడు సచిన్ టెండూల్కర్. ‘క్రికెట్ దేవుడి’గా కీర్తి ఘడించిన సచిన్ టెండూల్కర్‌, ఏప్రిల్ 24న 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు...

27
Image credit: PTI

అయితే అంతకంటే ముందుగానే ఏప్రిల్ 22న వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 22న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు, పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది...

37
Image credit: PTI

ఈ మ్యాచ్‌‌కి ముందు సచిన్ టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగబోతున్నాయి. ‘సచిన్... సచిన్...’ అనేది కేవలం ఓ అరుపు మాత్రమే కాదు, అది ఓ ఎమోషన్. సచిన్ టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మీరు కూడా భాగం కండి. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ముగిసిన తర్వాత గ్రౌండ్ మొత్తం సచిన్... సచిన్.. నామస్మరణతో మార్మోగిపోతుంది...

47

స్టేడియంలో ఉన్న 33 వేల మంది, 33 వేల టెండూల్కర్ ఫేస్ మాస్కులతో కనిపిస్తారు. అంటే గ్రౌండ్‌లో ప్రతీ సీటులోనూ సచిన్ టెండూల్కరే ఉంటాడు. గ్రౌండ్‌లోని ప్రతీ వ్యక్తి, సచిన్ టెండూల్కర్‌పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటాడు.. ఇలాంటిది క్రికెట్ చరిత్రలో నభూతోః నభవిష్యత్...

57

సచిన్ టెండూల్కర్ ప్రత్యేకమైన మైనపు బొమ్మను వాంఖడే స్టేడియంలోనే గార్‌వారే పెవిలియన్‌ బయట ప్రతిష్టించబోతున్నాం. అక్కడ ఆ బొమ్మతో మీరు సెల్ఫీలు దిగవచ్చు...’ అంటూ స్టేట్‌మెంట్ ద్వారా తెలియచేసింది ముంబై ఇండియన్స్ టీమ్..

67
Image credit: Getty

ఐపీఎల్‌లో ఎప్పుడూ కూడా ఓ క్రికెటర్ పుట్టినరోజు వేడుకలు ఈ రేంజ్‌లో ఇంతకుముందు జరగలేదు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నారు. ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు వేడుకలతో ఓ కొత్త సంస్కృతికి తెర లేవనుంది...

77

మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్.. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అదిరిపోయే బౌలింగ్ వేసి ఇంప్రెస్ చేశాడు. సచిన్ బర్త్ డే వేడుకల్లో అర్జున్ టెండూల్కర్‌తో పాటు కూతురు సారా టెండూల్కర్, భార్య అంజలి కూడా పాల్గొనబోతున్నారు.

click me!

Recommended Stories