IPL 2023: ఐపీఎల్ లో తమ జట్టును మరోసారి ప్లేఆఫ్స్ కు చేర్చడంలో సఫలమైన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తాజాగా తన టీమ్, ఫామ్, ఇతరత్రా విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రెండేండ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్ లో మళ్లీ ప్లేఆఫ్స్ ఆడుతున్న ముంబై ఇండియన్స్.. చెన్నైలో లక్నో సూపర్ జెయింట్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడుతున్నది. ఈ మ్యాచ్ కు ముందు ముంబై సారథి రోహిత్ శర్మ తన టీమ్, జట్టులో కొత్త కుర్రాళ్లు, 2011 వన్డే వరల్డ్ కప్ లో తనకు అవకాశం రాకపోవడం వంటి విషయాలపై ఆసక్తికర విషయాలు చేశాడు. జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడాడు.
26
ముంబై టీమ్ లో జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండటం వల్లే ఆ జట్టు కప్ గెలిచిందని.. వాళ్లందరూ వెళ్లాక ముంబైకి కష్టాలు మొదలయ్యాయని వస్తున్న విమర్శలకు రోహిత్ స్పందించాడు.
36
‘బుమ్రా, హార్ధిక్, కృనాల్ స్టోరీ కూడా ప్రస్తుతం ఉన్న తిలక్ వర్మ, నెహల్ వధెర వంటిదే. మీరు చూడండి.. రాబోయే రెండేండ్లలో వీళ్లు ముంబై విజయాలలో కీలక పాత్ర పోషిస్తారు. ముంబైకే కాదు టీమిండియా తరఫున కూడా స్టార్లుగా మారుతారు.
46
ముంబైకి స్టార్లు అవసరం లేదు. ఈ టీమ్ లోకి వస్తే వారిన స్టార్లుగా తీర్చిదిద్దుతారు. అప్పుడు వీళ్లే మాది సూపర్ స్టార్ టీమ్ అంటారు. ఆ మేరకు టీమ్ మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాప్ అహర్నిశలూ కృషి చేస్తున్నారు. వేలంలో ఎందరో సూపర్ స్టార్స్ అందుబాటులో ఉన్నా మేనేజ్మెంట్ మాత్రం యువ ఆటగాళ్లను తీసుకుని వారిపై నమ్మకం ఉంచి వారిని భవిష్యత్ సూపర్ స్టార్లు గా తీర్చిదిద్దుతున్నది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. కామెంట్స్ గురించి మేం పట్టించుకోం’ అని చెప్పాడు.
56
Image credit: PTI
ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలని.. అలా ఉంటేనే వారి నుంచి ఫలితాలు రాబట్టొచ్చని రోహిత్ అన్నాడు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు ఎవరైనా ఏ సమస్యపై అయినా తనను సంప్రదించినా.. టీమ్ ను అడిగినా వారికి అండగా ఉంటామని చెప్పుకొచ్చాడు.
66
2011 వన్డే వరల్డ్ కప్ లో తాను ఎంపిక కాకపోవడం తనను చాలా బాధించిందని అయితే దీనిలో తాను ఎవరినీ నిందించబోనని హిట్‌మ్యాన్ చెప్పాడు. దాని తర్వాత తాను తన ఆటపై దృష్టిపెట్టానని.. యోగా, మెడిటేషన్ తో పాటు ఒంటరిగా గడిపానని హిట్ మ్యాన్ చెప్పాడు. అది తన కెరీర్ కు చాలా ఉపయోగపడిందని రోహిత్ తెలిపాడు.