ఒక్కో వికెట్‌కి రూ.8 కోట్లు! ఐపీఎల్ 2023 నుంచి జోఫ్రా ఆర్చర్ అవుట్! తీసిన 2 వికెట్లకి...

Published : May 09, 2023, 03:25 PM IST

అనుకున్నదే అయ్యింది. ఏడాదిన్నర తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, మరోసారి గాయపడ్డాడు. గాయం కారణంగా ఈ సీజన్‌లో 5 మ్యాచులు మాత్రమే ఆడిన జోఫ్రా ఆర్చర్, తీసింది రెండంటే రెండు వికెట్లు మాత్రమే...

PREV
17
ఒక్కో వికెట్‌కి రూ.8 కోట్లు! ఐపీఎల్ 2023 నుంచి జోఫ్రా ఆర్చర్ అవుట్! తీసిన 2 వికెట్లకి...

ఆర్‌సీబీతో మొదటి మ్యాచ్ తర్వాత వరుసగా 4 మ్యాచులకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ ఓ మ్యాచ్ ఆడి తర్వాతి మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్నాడు. ఆర్చర్ గాయంతో బాధపడుతున్నాడని, చికిత్స కోసం బెల్జియం వెళ్లాడని వార్తలు వచ్చాయి..

27
Jofra Archer

అయితే ఆ వార్తల్లో నిజం లేదని జోఫ్రా ఆర్చర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. తాజాగా జోఫ్రా ఆర్చర్ గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడని, అతని స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా క్రిస్ జోర్డాన్‌ని తీసుకున్నట్టు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది..

37
Archer bowling nets

ఐపీఎల్ 2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్, 2022 సీజన్‌లో ఆడడని తెలిసినా, అతన్ని ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంది. దీంతో 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే రూ.8 కోట్లు తీసుకున్నాడు ఆర్చర్...

47
Image credit: Mumbai Indians/Facebook

2023 సీజన్‌లో 5 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీసుకున్న జోఫ్రా ఆర్చర్, మరోసారి రూ.8 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఆర్చర్ తీసిన ఒక్కో వికెట్ ఖరీదు రూ.8 కోట్లు..

57

Jofra Archer

బుమ్రా, ఆర్చర్‌లు కలిసి మ్యాచులు గెలిపిస్తారని ఆశపడి, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించని ముంబై ఇండియన్స్... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది..

67

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి, నాలుగే విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, 2023 సీజన్‌లో మొదటి 10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. నేడు ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడుతున్న ముంబై, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 4 మ్యాచుల్లో కనీసం 3 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.. 

77
Chris Jordan

ఐపీఎల్‌లో ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్‌కి ఆడిన క్రిస్ జోర్డాన్, 28 ఐపీఎల్ మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. జోర్డాన్‌కి బేస్ ప్రైజ్ రూ.2 కోట్ల చెల్లించనుంది ముంబై ఇండియన్స్..

click me!

Recommended Stories