IPL 2023: గబ్బర్ మరో ఘనత.. కోహ్లీ, వార్నర్‌ల తర్వాత అతడే

Published : May 08, 2023, 10:29 PM IST

IPL 2023, KKR vs PBKS: పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ ఐపీఎల్ లో తన పేరిట మరో ఘనతను సొంతం  చేసుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో  ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో...

PREV
16
IPL 2023: గబ్బర్ మరో  ఘనత.. కోహ్లీ, వార్నర్‌ల తర్వాత అతడే

ఐపీఎల్‌లో ఇదివరకే ఆరు వేల పరుగుల క్లబ్ లో చేరి తన పేరిట  పదుల సంఖ్యలో రికార్డులు నమోదుచేసుకున్న పంజాబ్ కింగ్స్  సారథి శిఖర్ ధావన్  తాజాగా మరో  ఘనతను  అందుకున్నాడు. ఐపీఎల్ లో 50 ఫిఫ్టీలు సాధించిన మూడో బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. 

26

కోల్‌కతా నైట్ రైడర్స్ తో  ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్  కు వచ్చిన పంజాబ్ ను ధావన్ ఆదుకున్నాడు.  47 బంతుల్లో 9 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో  57 పరుగులు చేశాడు. ఐపీఎల్ -16 సీజన్ లో ధావన్ కు ఇది మూడో హాఫ్ సెంచరీ. 

36
Image credit: PTI

కాగా ఐపీఎల్ లో  ధావన్ కు ఇది  50వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. గతంలో ఈ రికార్డు సాధించిన ఘనత కేవలం   డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీలకు మాత్రమే ఉంది.  వార్నర్..  ఐపీఎల్ లో 59 హాఫ్ సెంచరీలు చేయగా కోహ్లీ  పేరిట 50 అర్థ  సెంచరీలున్నాయి. తాజాగా ధావన్ వీరి సరసన చేరాడు. అంతేగాక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్ గా కూడా అతడు వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

46

వార్నర్, కోహ్లీ, ధావన్ తర్వాత  ఈ జాబితాలో  రోహిత్ శర్మ (41), ఏబీ డివిలియర్స్ (40), సురేశ్ రైనా (39), గౌతం గంభీర్ (36), కెఎల్ రాహుల్ (33) లు ఉన్నారు.  

56

కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో  ధావన్.. రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ధావన్  ఇప్పటివరకు ఐపీఎల్ లో  214 మ్యాచ్ లలో  213 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి  6,593 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు  50 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు నమోదు చేశాడు. 

66

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందున్నాడు.  2008 నుంచి ఐపీఎల్  ఆడుతున్న కోహ్లీ.. 233 మ్యాచ్ లలో 225 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి  7,043 పరుగులు సాధించాడు. కోహ్లీ ఖాతాలో 50 హాఫ్ సెంచరీలు,  ఐదు సెంచరీలు ఉన్నాయి.  

click me!

Recommended Stories