ఆ రూల్స్‌ని ఏ మాత్రం పట్టించుకోని ధోనీ... ప్రజాక్షేమం పట్టించుకోని సెలబ్రిటీల లిస్టులో టాప్ ప్లేస్ మాహీకే...

First Published May 17, 2023, 11:01 PM IST

భారత క్రికెటర్‌గా, కెప్టెన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ మరే క్రికెటర్‌కీ ఉండదు. అయితే ధోనీకి వ్యతిరేకంగా కొన్ని వందల కేసులు నమోదవుతున్నాయంటే నమ్ముతారా...
 

MS Dhoni

అడ్వర్టైజింగ్ సెల్ఫ్ రెగ్యూలేటరీ బాడీ (ASCI) బయటపెట్టిన సమాచారం ప్రకారం ప్రజాక్షేమం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసుకుంటూ పోతున్న సెలబ్రేటీలపై క్రమేణా ఫిర్యాదులు పెరుగుతున్నాయట...

సక్సెస్‌తో పాటు పాపులారిటీ, క్రేజ్ వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు బాధ్యత కూడా పెరుగుతుంది. మనం చెబితే లక్షల మంది ఓ వస్తువుని గుడ్డిగా నమ్మి కొంటారని తెలిసినప్పుడు... ప్రచారం చేసే ఆ వస్తువు  నాణ్యత గురించి, సంస్థ ప్రమాణాల గురించి తెలుసుకుని, అది సరైనదా? కాదా? అనే విషయాల గురించి తెలుసుకుని ప్రచారం చేయాల్సి ఉంటుంది..

Latest Videos


అయితే ఎలాంటి కనీస అవగాహన లేకుండా ప్రకటనలు చేస్తున్నట్టు ASCI విడుదల చేసిన సెలబ్రిటీల లిస్టులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాప్‌లో ఉండడం విశేషం. యూట్యూబ్ కమెడియన్ భువన్ బామ్, మాహీ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు..

ఫలానా సెలబ్రిటీ చెప్పడం వల్లే నాణ్యత లేని వస్తువుని కొని మోసపోయానని వినియోగదారులు, వినియోగదారుల ఫోరం‌ని ఆశ్రయించవచ్చు. ఇంతకుముందు ఇలాంటి వాటిని జనాలు పట్టించుకునేవాళ్లు కాదు...

Image credit: MS DhoniFacebook

అయితే గత 55 ఏళ్లలో ఇలా సెలబ్రిటీలపై వస్తున్న ఫిర్యాదులు 803 శాతం పెరిగాయట. 503 ప్రకటనలపై ఫిర్యాదు వచ్చినట్టు ASCI తెలిపింది. 
 

వినియోగదారుల ఆరోగ్యానికి, సంక్షేమానికి భంగం కలిగించే సమాచారం, ప్రకటనల రెగ్యూలేషన్ రూల్స్‌‌ని అతిక్రమించి రూపొందిస్తున్న యాడ్స్‌లో ధోనీ లాంటి ఇమేజ్ ఉన్న సెలబ్రిటీలు నటించడం జరుగుతున్నట్టు ఈ సంస్థ గుర్తించింది..
 

ఆన్‌లైన్  గేమింగ్‌తో పాటు క్లాసికల్ ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్ వంటి వివిధ విభాగాలకు చెందిన యాడ్స్ ద్వారా జనాలు ఎక్కువగా మోసపోతున్నారు. అయితే ఈ మోసాల గురించి చాలామంది వినియోగదారులకు అవగాహన ఉండడం లేదు..

playing game

2023 ఏడాదిలో వ్యాపార ప్రకటనల స్వీయ నియంత్రణ సంస్థ 8,951 ఫిర్యాదులు అందుకుంది. ఇందులో వివిధ మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న 7,928 వ్యాపార ప్రకటనలను రివ్యూ చేశారు. ఇందులో మూడున్నర ఫిర్యాదులు డిజిటల్ మీడియాలోనే ప్రసారం అవుతున్న యాడ్స్‌పైనే రావడం విశేషం..

click me!