ప్రపంచంలో ఏ బ్యాటర్ బాగా ఆడినా దానికి ధోనీయే కారణమంటారు మాహీ ఫ్యాన్స్. ధోనీతో కలిసి ఆడడం వల్ల, ధోనీని కలవడం వల్ల, ధోనీతో మాట్లాడడం వల్ల, ఆఖరికి ధోనీ మ్యాచ్ ఫినిష్ చేసే విధానం చూడడం వల్లే వాళ్లు అలా ఆడగలిగారని అంటారు. మొదట్లో ఇది బాగా వర్కవుట్ అయినా ఈ మధ్య తీవ్రమైన ట్రోల్స్‌కి కారణమవుతోంది..
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీ జారిపడ్డాడని, ఈ సమయంలో అతని మోకాలికి గాయమైందని వార్తలు వచ్చాయి. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్ సమయంలో అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్...
26
తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన మహేంద్ర సింగ్ ధోనీ, చివరి బంతికి సిక్సర్ కొట్టలేకపోయాడు. చివరి 3 బంతుల్లో 3 సింగిల్స్ మాత్రమే ఇచ్చిన సందీప్ శర్మ, ఆఖరి బంతికి అద్భుతమైన యార్కర్ వేసి మాహీ సిక్స్ కొట్టకుండా అడ్డుకోగలిగాడు...
సందీప్ శర్మకు క్రెడిట్ పోతే, మాహీని తక్కువ చేసినట్టే. అందుకే ఆఖరి బంతికి ధోనీ సిక్సర్ బాదలేకపోవడానికి అతని గాయమే కారణమని ప్లేట్ మారుస్తున్నాడు సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్. ధోనీకి గాయం లేకపోయి ఉంటే మ్యాచ్‌ని ఎప్పుడూ ఫినిష్ చేసేవాడని అంటున్నాడు..
‘ధోనీకి మోకాలి గాయమైంది. కొన్ని రోజులు అతని ఆ గాయంతోనే ఆడుతున్నాడు. మాహీ బ్యాటింగ్ గమనిస్తే మీకు ఆ విషయం అర్థం అవుతుంది. ధోనీ ఫిట్‌నెస్ గురించి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచే మాహీ ప్రాక్టీస్ చేస్తున్నాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టీఫెన్ ఫ్లెమ్మింగ్...
ధోనీ గాయం నిజమైనదే కావచ్చు, అయితే ఆఖరి బంతికి బౌండరీ కొట్టలేక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడం అభిమానుల్లో సానుభూతి క్రియేట్ చేసేందుకేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధోనీ నిజంగా గాయపడి ఉంటే ఇంతకుముందు మ్యాచుల సమయంలో ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడలేదని అంటున్నారు..
66
dhoni
మాహీ ఒకవేళ చివరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్ ఫినిష్ చేసి ఉంటే... ఈ విషయం చెప్పేవారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘దీపక్ చాహార్, మగల కూడా గాయాలతో సతమతమవుతున్నారు. వారి ఫిట్‌నెస్ గురించి ఇంకా మాకు సరైన అప్‌డేట్ రాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు స్టీఫెన్ ఫ్లెమ్మింగ్..