ఆ విషయంలో ధోనీ తోపు! ప్లేఆఫ్స్‌కి వెళ్లారో వాళ్లను ఆపడం కష్టం... - రవిశాస్త్రి కామెంట్స్...

First Published May 11, 2023, 3:31 PM IST

టీమిండియాకే కాదు, ఐపీఎల్‌లో కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి 9వ స్థానంలో నిలిచిన సీఎస్‌కే, 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ బెర్త్‌కి అడుగు దూరంలో ఉంది...

ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఇంకో మ్యాచ్ గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఐపీఎల్‌లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడిన ప్రతీసారీ ఫైనల్ చేరింది చెన్నై సూపర్ కింగ్స్...

సీఎస్‌కే ఈసారి టాప్ 2లో నిలిచి మొదటి క్వాలిఫైయర్ ఆడితే ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. అన్యూహ్యాంగా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్, రోహిత్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ ప్రతీసారీ టైటిల్ గెలిచింది. దీంతో ఇరు జట్ల మధ్య మరోసారి ఫైనల్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Latest Videos


‘టీమ్ కాంబినేషన్స్ క్రియేట్ చేయడంలో ధోనీ తోపు, మాస్టర్.  ప్రతీ ప్లేయర్‌ బలబలాలను పూర్తిగా చదివి, అతను ఏ ప్లేస్‌లో ఫిక్స్ అవుతాడో అదే ప్లేస్‌లో దింపుతాడు. 2022లో ఫెయిల్ అయిన ప్లేయర్‌ కూడా ఈసారి బాగా ఆడుతున్నారు...

2022 సీజన్‌లో కొందరు సీఎస్‌కే ప్లేయర్లు ఫెయిల్ అయ్యారు. అయితే ఈసారి వాళ్లే చెన్నై సూపర్ కింగ్స్‌కి మ్యాచ్ విన్నర్లుగా మారారు. దీనికి కారణం ధోనీ వాడుతున్న కాంబినేషన్ టెక్నికే. ధోనీ ఏం మాయ చేస్తాడో నాకైతే అర్థం కాదు..

Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లోకి వెళితే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌లో రెండు మ్యాచులు కూడా చెన్నైలో జరగబోతున్నాయి. వాళ్లకు అక్కడ గెలవడం కొట్టిన పిండి.. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కేని అడ్డుకోవడం కష్టమైపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి...

Image credit: PTI

గత సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన రవీంద్ర జడేజా, ఈసారి ఇప్పటికే మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. అలాగే శివమ్ దూబే, మొయిన్ ఆలీ కూడా అదరగొడుతున్నారు.. 

click me!