ఫిట్‌గా ఉన్నా! బౌలింగ్ ఇస్తే కదా వేయడానికి... శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Published : May 11, 2023, 02:09 PM IST

ఐపీఎల్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసి... హాఫ్ సెంచరీ బాదాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. బౌలింగ్‌లో 2 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు...

PREV
18
ఫిట్‌గా ఉన్నా! బౌలింగ్ ఇస్తే కదా వేయడానికి... శార్దూల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
Image credit: PTI

ఐపీఎల్ 2021 సీజన్‌లో 21 వికెట్లు తీసి, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో సారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు శార్దూల్ ఠాకూర్. ఈ ప్రదర్శన కారణంగానే 2022 సీజన్‌లో అతని కోసం రూ.10.75 కోట్ల భారీ మొత్తం ఖర్చు పెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్..
 

28
Image credit: PTI

2022 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్ 14 మ్యాచుల్లో 15 వికెట్లు తీయడంతో అతన్ని కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ట్రేడ్ చేసింది. ఈ సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన శార్దూల్ ఠాకూర్ బ్యాటుతో 109 పరుగులు చేస్తే, బౌలింగ్ చేసింది 15 ఓవర్ల కంటే తక్కువే. 6 ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు శార్దూల్ ఠాకూర్...
 

38
Image credit: PTI

వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ వంటి స్పిన్నర్లను వాడుతున్న కేకేఆర్... వైభవ్ అరోరా, హర్షిత్ రాణా వంటి కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం ఇస్తోంది. అయితే శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు దక్కినా బౌలింగ్ ఇవ్వడం లేదు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా..
 

48

‘మా టీమ్‌లో ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. నితీశ్ రాణాతో కలిపి మా టీమ్‌లో 11 మందిలో 8 మంది బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ రాణా కూడా ప్రతీ మ్యాచ్‌లో ఒకటి రెండు ఓవర్లు వేస్తున్నాడు..
 

58

నాకు సీజన్ మధ్యలో చిన్న గాయమైంది. అది ఎప్పుడో తగ్గిపోయింది. కమ్‌బ్యాక్ తర్వాత బౌలింగ్ వేసేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ సాధించాను. అయితే నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందని మా కెప్టెన్ అనుకోవాలిగా...

68

పరిస్థితులను బట్టి ఏ బౌలర్‌ని వాడాలనేది కెప్టెన్ డిసైడ్ చేస్తాడు. నాకు బౌలింగ్ ఇచ్చినప్పుడు వేస్తున్నా, ఇవ్వకపోతే ఎదురుచూస్తున్నా.. టీ20ల్లో ఆల్‌రౌండర్‌గా ఉండడం అంత తేలికైన పని కాదు. శరీరంపై తీవ్రమైన శ్రమ పడుతుంది..

78

ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయాలి, బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి.. వీటితో పాటు గ్రౌండ్‌ మొత్తం రౌండ్స్ వేస్తూ ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇన్ని చేస్తే ఎవ్వరైనా అలసిపోవాల్సిందే.  అందుకే ఫిట్‌నెస్ కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్‌ అయిపోయింది..’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్...

88

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కింది. జయ్‌దేవ్ ఉనద్కట్‌తో పాటు ఉమేశ్ యాదవ్ గాయాలతో బాధపడుతుండడంతో శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. 

click me!

Recommended Stories