ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచి, ధోనీ రిటైర్మెంట్ ప్రకటన ఇవ్వబోతున్నాడా... లేక మరోసారి సైలెంట్‌గా..

Published : May 28, 2023, 04:51 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి పెద్దగా అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అయితే 2023 సీజన్ మాత్రం మునుపటి రికార్డులను బ్రేక్ చేస్తూ టీఆర్పీలో, వ్యూయర్‌షిప్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌టైం రికార్డు పీక్ వ్యూయర్‌షిప్ రికార్డు అవ్వచ్చని అంచనా...

PREV
17
ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచి, ధోనీ రిటైర్మెంట్ ప్రకటన ఇవ్వబోతున్నాడా... లేక మరోసారి సైలెంట్‌గా..

మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఐపీఎల్‌లో చివరిసారిగా మాహీ బ్యాటింగ్ చూసే అవకాశం ఈరోజే దక్కుతుంది..
 

27

ధోనీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు జియో సినిమా యాప్‌లో రియల్ టైం వ్యూస్ 3 కోట్ల మార్కును దాటవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మాహీ బ్యాటింగ్ మరోసారి చూస్తామో లేదోనని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కోపోవడం ఖాయం...

37
Image credit: Sandeep Rana

అయితే ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేయబోతున్నాడా? మాహీ ఫ్యాన్స్ ఇదే ఫిక్స్ అయిపోయారు. అయితే సీఎస్‌కేకి బదులుగా గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిస్తే పరిస్థితి ఏంటి?..

47
MS Dhoni

ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచినా, గెలవకపోయినా మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన మాత్రం రాకపోవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కారణం అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకున్న తీరే...

57
(PTI Photo/Manvender Vashist Lav)(PTI05_20_2023_000232B)

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఏడాది పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు ఆగస్టు 15న ఎవ్వరూ ఊహించని సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నానని భావించండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించాడు...

67
Image credit: PTI

ఐపీఎల్ నుంచి కూడా ధోనీ ఇలాగే తప్పుకుంటాడని చాలా మంది అభిప్రాయం. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా ఐపీఎల్ స్టేజీ మీద ధోనీ నుంచి రిటైర్మెంట్ ప్రకటన రాకపోవచ్చని... సైలెంట్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని భావిస్తున్నారు మాహీ ఫ్యాన్స్..
 

77
MS Dhoni Ice Pack

అంతర్జాతీయ క్రికెట్ నుంచి సైలెంట్‌గా తప్పుకున్నా, ఐపీఎల్‌లో తన మనసుకి ఎంతో చేరువైన చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్ నుంచి రిటైర్ అయ్యే సమయంలో మాహీ ఎమోషనల్ అవ్వొచ్చు... ఫైనల్ తర్వాత మాహీ స్పీచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. 

Read more Photos on
click me!

Recommended Stories