టాపార్డర్ బ్యాటర్‌గా టీమ్‌లోకి వచ్చా, ధోనీయేమో బౌలర్‌ని చేసేశాడు... దీపక్ చాహార్ షాకింగ్ కామెంట్స్...

First Published May 28, 2023, 4:21 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు దీపక్ చాహార్. గాయం కారణంగా అతను టీమ్‌కి దూరం కావడంతో 2022 సీజన్‌లో సీఎస్‌కే అట్టర్ ఫ్లాప్ అయ్యింది..

Deepak Chahar

ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా గాయం కారణంగా 6 మ్యాచులకు దూరంగా ఉన్నాడు దీపక్ చాహార్. మొదటి 4 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన దీపక్ చాహార్, రీఎంట్రీ తర్వాత 5 మ్యాచుల్లో 12 వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

PTI PhotoR Senthil Kumar)(PTI05_23_2023_000393B)

ఐపీఎల్ కెరీర్‌లో 72 మ్యాచుల్లో 71 వికెట్లు తీసిన దీపక్ చాహార్, వాస్తవానికి టాపార్డర్ బ్యాటర్‌గా టీమ్‌లోకి వచ్చాడట. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ టీమ్ ద్వారా వెలుగులోకి వచ్చిన దీపక్ చాహార్, ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ ప్రోగ్రామ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

PTI PhotoR Senthil Kumar)(PTI05_23_2023_000356B)

‘వాస్తవానికి స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ నన్ను బ్యాటింగ్ కోసం సెలక్ట్ చేశాడు. మాహీని మొదట సారి కలిసినప్పుడు కూడా నేను బ్యాటింగ్ చేస్తున్నా. క్యాంపులో మొదటి రోజు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వెళ్లాను...

PTI PhotoR Senthil Kumar)(PTI05_06_2023_000174B)

ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టి 30 పరుగులు చేశాను. అయితే ఆ తర్వాతి ఓవర్‌లో సింగిల్ తీయడానికి ప్రయత్నించినప్పుడ హార్మ్‌స్ట్రింగ్ గాయమైంది. అందుకే 2016 సీజన్‌లో ఎక్కువ మ్యాచులు ఆడలేకపోయాను...

PTI PhotoShailendra Bhojak)(PTI04_17_2023_000216B)

గాయం నుంచి కోలుకునే సమయానికి టీమ్ కాంబినేషన్ సెట్ అయిపోయింది. అందుకే ఆ సీజన్‌లో 3 మ్యాచులే ఆడాల్సి వచ్చింది. 2018 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌ నన్ను కొనుగోలు చేసింది. ఫ్లెమ్మింగ్, నన్ను టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయించాలని అనుకున్నాడు..

అయితే ధోనీ మాత్రం దానికి ఒప్పుకోలేదు. బౌలర్‌గానే వాడాలని అనుకున్నాడు. ఆ సీజన్‌లో నేను పెద్దగా వికెట్లు తీయకపోయినా 12 మ్యాచుల్లో ఆడించారు. మా సీఈవో వచ్చి, టీమ్ షీట్ రాసేటప్పుడు ధోనీ మొదట నీ పేరే రాస్తున్నాడని చెప్పారు. ఆ మూమెంట్‌ నాకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టు అనిపించింది...’ అంటూ కామెంట్ చేశాడు దీపక్ చాహార్.. 

click me!