పక్కనబెట్టినోడు, గెలిపించాడు... గ్లెన్ ఫిలిప్స్‌ని ఇన్నాళ్లు రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టిన సన్‌రైజర్స్...

Published : May 08, 2023, 09:22 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో సొంత ఫ్యాన్స్‌ని కూడా విసిగించిన టీమ్ ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు...

PREV
18
పక్కనబెట్టినోడు, గెలిపించాడు... గ్లెన్ ఫిలిప్స్‌ని ఇన్నాళ్లు రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టిన సన్‌రైజర్స్...

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో అది కూడా స్పిన్ బౌలర్ బౌలింగ్‌లో 9 పరుగులు కొట్టలేకపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 215 పరుగుల భారీ టార్గెట్ ఉండడంతో సన్‌రైజర్స్‌పై ఆశలు లేవు...

28

ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో మరో ఓటమి చేరడం ఖాయమనుకున్నారంతా. అయితే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి అదరగొట్టారు..
 

38

అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 33, అభిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 47, హెన్రీచ్ క్లాసిన్ 26 పరుగులు చేయగా కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ 6 పరుగులు చేసి అవుటైనా 9 మ్యాచుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు మెరిపించాడు..
 

48

7 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కుల్దిప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో 22 పరుగులు రాబట్టిన గ్లెన్ ఫిలిప్స్, మ్యాచ్‌లో 7 బంతులు ఉండగా అవుట్ అయ్యాడు..

58
Abdul Samad

7 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన సమయంలో అబ్దుల్ సమద్ 2 సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదించిన అత్యధిక లక్ష్యం ఇదే..

68
Image credit: PTI

ఓవరాల్‌లో ఐపీఎల్‌లో ఛేదించిన అత్యధిక మూడోస్కోరు ఇది. ఇంతకుముందు 2020లో రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్ కింగ్స్‌పై 224 పరుగులు ఛేదించగా ముంబై ఇండియన్స్, చెన్నైపై 2021లో 219 పరుగులు ఛేదించింది..
 

78

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరుపున అత్యధిక స్ట్రైయిక్ రేటు నమోదు చేసిన రెండో బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్. ఇంతకుముందు 2022లో శశాంత్ సింగ్ 6 బంతుల్లో 25 పరుగులు చేయగా (స్ట్రైయిక్ రేటు 416.6), గ్లెన్ ఫిలిప్స్ 7 బంతుల్లో 25 పరుగులు (స్ట్రైయిక్ రేటు 357.14) బాదాడు..

88
Image credit: PTI

వరుసగా విఫలమవుతున్న హారీ బ్రూక్‌, మయాంక్ అగర్వాల్‌కి ఛాన్సులు ఇస్తూ సమయాన్ని వృథా చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... హెన్రీచ్ క్లాసిన్, గ్లెన్ ఫిలిప్స్‌లను మొదటి నుంచి కొనసాగించి ఉంటే ఇప్పటికి ఆరెంజ్ ఆర్మీ పొజిషన్ వేరేగా ఉండేదని అంటున్నారు అభిమానులు.. 

click me!

Recommended Stories