గుజరాత్ టైటాన్స్ కన్ఫార్మ్... ఇంకా ఫ్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ, హైదరాబాద్‌!ఏ టీమ్‌కి ఎంత ఛాన్స్ ఉంది?...

Published : May 08, 2023, 09:46 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఇప్పటికే మూడో క్వార్టర్‌కి చేరుకుంది. ఇప్పటికే 52 మ్యాచులు ముగిసినా ప్లేఆఫ్స్ చేరే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది...

PREV
18
గుజరాత్ టైటాన్స్ కన్ఫార్మ్... ఇంకా ఫ్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ, హైదరాబాద్‌!ఏ టీమ్‌కి ఎంత ఛాన్స్ ఉంది?...

చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుంటే, లక్నో సూపర్ జెయింట్స్‌ 11 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కావడంతో సీఎస్‌కే 13, ఎల్‌ఎస్‌జీ 11 పాయింట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి...
 

28
Image credit: PTI

మొదటి 6 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత 5 మ్యాచుల్లో నాలుగు పరాజయాలు అందుకుంది. ఈజీగా ప్లేఆఫ్స్ చేరుతుందని అనుకున్న రాజస్థాన్ రాయల్స్, ఇంకా నాలుగో స్థానంలోనే ఉంది..

38

ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌ది ఒకే కథ. 10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న ఈ మూడు జట్లు, వరుసగా 5,6, 7 స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరేందుకు ఈ మూడు జట్లకు ఇంకా అవకాశాలు ఉన్నాయి..

48
Image credit: PTI

కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచుల్లో నాలుగేసి విజయాలతో 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు మిగిలిన 4 మ్యాచుల్లో ఒక్క పరాజయం అందుకున్నా, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి.. 
 

58

ఈసారి ప్లేఆఫ్స్ బెర్తులు కన్ఫార్మ్ చేసేందుకు నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. ఇప్పటికి +0.951 నెట్ రన్ రేటుతో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్, మిగిలిన మ్యాచుల్లో గెలవకపోయినా భారీ తేడాతో చిత్తుగా ఓడిపోకపోతే చాలు, ప్లేఆఫ్స్‌కి వెళ్లిపోవచ్చు...
 

68
Image credit: PTI

11 మ్యాచుల్లో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించిన చెన్నై టీమ్, ప్లేఆఫ్స్ చేరాలంటే మరో 2 మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ మిగిలిన 3 మ్యాచుల్లో మూడు గెలిస్తే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది..

78
Rajasthan Royals

వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ ఛాన్సులను క్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, లక్నో కంటే మెరుగైన నెట్ రన్ రేటుతో ఉంది. అయితే లక్నోకి వర్షం కారణంగా అదనంగా మరో పాయింట్ దక్కింది. దీంతో మిగిలిన 3 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్, 3 విజయాలు అందుకుంటేనే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. 

88

ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌... మిగిలిన 4 మ్యాచుల్లో కనీసం 3 విజయాలు అందుకోవాలి. కేకేఆర్, సన్‌రైజర్స్, ఢిల్లీలకు ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డైలాంటిదే.. 

click me!

Recommended Stories