ఆ షాట్ చూస్తే ధోనీలా అనిపించాడు.. తిలక్ వర్మ హెలికాఫ్టర్ షాట్‌పై మహ్మద్ కైఫ్ ప్రశంస...

First Published Apr 3, 2023, 6:45 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్‌స్టార్ తిలక్ వర్మ. ఐపీఎల్‌‌లో తెలుగువారికి అవకాశం రావడమే చాలా అరుదు. అయితే తిలక్ వర్మ కోసం ఏకంగా ఐదు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. రూ.1.70 కోట్లకు ముంబై ఇండియన్స్‌కి వెళ్లిన తిలక్ వర్మ, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు...

Tilak Varma

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇందులో తిలక్ వర్మ 46 బంతుల్లో 84 పరుగులు చేస్తే, మిగిలిన బ్యాటర్లు అందరూ కలిసి 75 బంతుల్లో 76 పరుగులే చేశారు...
 

46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసిన తిలక్ వర్మ, ఇన్నింగ్స్ డెత్ ఓవర్లలో బౌండరీలతో ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరి 3 ఓవర్లలో ఏకంగా 48 పరుగుల రాబట్టింది ముంబై ఇండియన్స్...
 

Latest Videos


ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో  ఓ హెలికాఫ్టర్ షాట్ ఆడి సిక్సర్ బాదాడు తిలక్ వర్మ. ఈ సిక్సర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

‘లెగ్ సైడ్, తిలక్ వర్మకు చాలా స్ట్రాంగ్ పొజిషన్. తన బాటమ్ హ్యాండ్‌‌ని వాడి సులువుగా గ్రౌండ్‌కి నలువైపులా సిక్సర్లు బాదుతున్నాడు. స్కూప్ షాట్స్ ఆడుతున్నాడు. లెగ్ సైడ్ మాత్రమే కాదు, ఆఫ్ సైడ్ కూడా సిక్సర్లు కొట్టాడు...

తిలక్ వర్మ కొట్టిన హెలికాఫ్టర్ షాట్‌ని అద్దంలో చూస్తే, మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్సర్‌లా అనిపిస్తుంది. అద్దంలో తిలక్ వర్మ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చూడొచ్చు. గత ఏడాది ముంబై ఇండియన్స్ వరుసగా మ్యాచులు ఓడిపోయింది..
 

అయితే తిలక్ వర్మ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ కుర్రాడిలో ఎంత టాలెంట్ ఉందో మరోసారి ప్రపంచానికి నిరూపితమైంది. తిలక్ వర్మకి తోడుగా మరోక్క ప్లేయర్ చివరి వరకూ బ్యాటింగ్ చేసి ఉంటే, ముంబై ఇండియన్స్ గెలిచి ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ కైఫ్...
 

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆడిన 20 ఏళ్ల తిలక్ వర్మ, 131.02 స్ట్రైయిక్ రేటుతో 397 పరుగులు చేశాడు. ఇందులో రెండు మాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

click me!