ఐపీఎల్ 2023 సీజన్‌లో తెలుగు వాళ్లు అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న తిలక్ వర్మ, ఆ టీమ్ తరుపున టాప్ స్కోరర్‌గా ఉంటే సీఎస్‌కే సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు, తన స్టైల్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ ఇద్దరి కంటే హైదరాబాదీ మియా మహ్మద్ సిరాజ్ బౌలింగ్ మరో లెవెల్...
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ బౌలింగ్‌కి ఓ బ్రాండ్ ఉంది. 200+ స్కోరు చేసినా సరే, దాన్ని ప్రత్యర్థి బ్యాటర్ల చేత ఈజీగా కొట్టించడం ఆర్‌సీబీ బౌలర్లకు బాగా అలవాటు. అందుకే ఐపీఎల్‌లో 200+ స్కోరు చేసినా, ఎక్కువ సార్లు ఓడిన జట్టుగా చెత్త రికార్డు మూటకట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
27
ఒకే మ్యాచ్‌లో 60+కి పైగా పరుగులు సమర్పించిన బౌలర్లు కూడా ఆర్‌సీబీలోనే మెండుగా ఉన్నారు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన విజయ్‌కుమార్ వైశాక్‌ని రెండో మ్యాచ్‌లో ఓ ఆటాడుకున్నారు సీఎస్‌కే బ్యాటర్లు. దీంతో 4 ఓవర్లలో 62 పరుగులు సమర్పించేశాడు ఈ బెంగళూరు బుల్లోడు..
37
Image credit: PTI
ఇలాంటి బౌలర్లతో నిండిన చుక్కల గుంపులో నిండు చంద్రుడిలా అదరగొడుతున్నాడు మన మహ్మద్ సిరాజ్. ఐపీఎల్ 2023 సీజన్‌లో పవర్ ప్లేలో ఇప్పటిదాకా 12 ఓవర్లలు (72 బంతులు) బౌలింగ్ చేసిన సిరాజ్, కేవలం 53 పరుగులు మాత్రమే సమర్పించాడు. సిరాజ్ పవర్ ప్లే ఎకానమీ 4.42 మాత్రమే..
మొత్తం 2023 సీజన్‌లో 120 బంతులు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ 69 డాట్ బాల్స్ ఇచ్చాడు. పవర్ ప్లేలో 72 బంతుల్లో 51 డాట్ బాల్స్ వేశాడు. బౌండరీల వర్షం కురిసే చిన్నస్వామి స్టేడియంలో 60 బాల్స్ వేసిన సిరాజ్, అందులో 43 డాట్ బాల్స్ వేశాడు..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీసిన సిరాజ్, కేకేఆర్‌పై 44 పరుగులిచ్చి కాస్ట్‌లీగా తేలాడు. అయితే మొదటి 2 ఓవర్లలో సిరాజ్ 13 పరుగులే ఇచ్చాడు..
67
Mohammed Siraj
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన సిరాజ్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి 23 పరుగులు సమర్పించాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పవర్ ప్లేలో అదరగొట్టిన సిరాజ్, 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు..
చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2023 సీజన్‌లో మహ్మద్ సిరాజ్ ఎకానమీ రేటు 6 ఉంటే, 13.71 యావరేజ్‌తో వికెట్లు తీశాడు. మిగిలిన ఆర్‌సీబీ బౌలర్లు 10.27 ఎకానమీతో పరుగులు ఇవ్వడమే కాకుండా 28.56 యావరేజ్‌తో వికెట్లు తీస్తూ బెంగళూరు పరాజయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు.