సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ.42 కోట్లు... కావాల్సింది 13 మంది! కెప్టెన్ కూడా లేడు...

First Published Dec 23, 2022, 1:15 PM IST

ఐపీఎల్‌లో మొదటి 8 సీజన్లలో ఆరుసార్లు నాకౌట్ స్టేజీకి అర్హత సాధించి, రెండు సార్లు ఫైనల్ ఆడి, ఓ సారి టైటిల్ గెలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే గత రెండు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్ఫామెన్స్ దారుణంగా దిగజారింది...

Moody and Lara

డేవిడ్ వార్నర్‌, మేనేజ్‌మెంట్ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దిగజారుతూ వచ్చింది. డేవిడ్ వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ తర్వాత టీమ్‌లో కూడా లేకుండా చేసింది ఆరెంజ్ ఆర్మీ మేనేజ్‌మెంట్...

Image credit: PTI

ఆరు సీజన్లుగా ప్రతీ సీజన్‌లోనూ 400-500 పరుగులు చేస్తూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారాన్ని మోస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్... అలా అవమాన భారంతో వెళ్లిపోవడంతో ఆరెంజ్ ఆర్మీకి సరైన బ్యాటర్ లేకుండా పోయాడు...

భారీ ఆశలతో, అంచనాలతో కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే... అతను నిలువునా ముంచాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి భారంగా మారిన ప్లేయర్ కేన్ మామనే. దీంతో అతన్ని కూడా సాగనంపింది సన్‌రైజర్స్...
 

భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్‌‌ని, కేన్ విలియంసన్‌ని వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.42.25 కోట్ల పర్సు వాల్యూతో బరిలో దిగుతున్న ఆరెంజ్ ఆర్మీ,  రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది...

మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్... ఇలా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ల కోసం చూడాల్సిన అవసరం లేదు..

రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ భారీ షాట్లు ఆడగల గత సీజన్‌లో నిరూపించుకున్నారు... మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉంది. టాపార్డర్‌తో పాటు స్పిన్ బౌలింగ్ విభాగం వీక్‌గా ఉంది.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కావాలి. అలాగే అభిషేక్ వర్మతో ఓపెనింగ్ చేసే భారీ హిట్టింగ్ ఓపెనర్ కావాలి..  ఫినిషర్ కూడా కావాలి... అన్నింటికీ మించి అర్జెంట్‌గా ఆరెంజ్ ఆర్మీకి ఓ కెప్టెన్ కావాలి..
 

Ben Stokes

బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, మయాంక్ అగర్వాల్, నారాయణ్ జగదీశన్, మనీశ్ పాండే... ఇలా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలోకి వచ్చే ప్రతీ స్టార్ ప్లేయర్‌ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించవచ్చు... ఒక్క ప్లేయర్ కోసం రూ.15-20 కోట్లు పెట్టగల సత్తా ఉన్న టీమ్ ఎస్‌ఆర్‌హెచ్ ఒక్కటే.. 

Image credit: Getty

వీవీఎస్ లక్ష్మణ్ ఉన్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్, వేలానికి కేవలం ఛాయ్, బిస్కెట్లు రుచి చూడడానికి మాత్రమే వెళ్లినట్టుగా వెళ్లి వచ్చేది. ప్లేయర్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. అయితే ఇప్పుడు సీన్ మారింది. టీమ్ పర్పామెన్స్ పడిపోతూ ఉంది...

హారీ బ్రూక్, షకీబ్ అల్ హసన్, జాసన్ హోల్డర్, రిలే రసోయ్, సికిందర్ రజా, ఆడమ్ మిల్నే, అదిల్ రషీద్, ఆడమ్ జంపా, జయ్‌దేవ్ ఉనద్కట్, తబ్రేజ్ షంసీ వంటి ప్లేయర్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ ఆసక్తి చూపించవచ్చు.

రషీద్ ఖాన్ దూరమైన తర్వాత మెరుగైన స్పిన్నర్ కోసం వెతుకుతున్న ఆరెంజ్ ఆర్మీ, షంసీ, జంపాలతో పాటు భారత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

ఇంగ్లాండ్ టెస్టు ప్లేయర్ జో రూట్, భారత మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానే, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ వంటి ప్లేయర్లను కొనే సాహసం చేయగల టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే...

Joe Root

ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ స్ట్రాటెజీ లేకుండా వేలానికి రావడమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కి ఎప్పుడూ ఉండే స్ట్రాటెజీ. ఈసారి కూడా అలాగే వేలానికి వచ్చి, ఎలా పడితే అలా ప్లేయర్లను కొనుగోలు చేసి విమర్శలు తెచ్చుకుంటారా? లేక పర్సులో ఉన్న డబ్బును సరిగ్గా వాడుకుని, తెలివిగా వ్యవహరిస్తారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. 

click me!