ఐపీఎల్ మినీ వేలం 2023: కావాల్సింది 11 మంది, పర్సులో ఉన్నది రూ.7 కోట్లు... కేకేఆర్ స్ట్రాటెజీ ఏంటి...

First Published Dec 23, 2022, 10:43 AM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఒకటి. మూడు సార్లు ఫైనల్ చేరిన కేకేఆర్, రెండుసార్లు టైటిల్ గెలిచింది. 2023 వేలానికి ముందు కేకేఆర్ పరిస్థితి, మిగిలిన జట్లకు భిన్నంగా ఉంది.. పర్సులో ఉన్నది రూ.7.05 కోట్లు కాగా, కావాల్సింది 11 మంది ప్లేయర్లు.. 

ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొంటున్న 10 ఫ్రాంఛైజీల్లో పర్సులో అతి తక్కువ మొత్తం ఉన్న జట్టు కోల్‌కత్తా నైట్‌రైడర్స్. వేలానికి ముందు కేకేఆర్ పర్సులో రూ.7 కోట్ల 05 లక్షలు మాత్రమే ఉన్నాయి...
 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కేకేఆర్‌కి మరో ముగ్గురు విదేశీ ప్లేయర్లు కూడా అవసరం. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు ఆండ్రే రస్సెల్, లూకీ ఫర్గూసన్, నితీశ్ రాణా, రహ్మనుల్లా గుర్భాజ్, టిమ్ సౌథీ, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేసుకుంది కేకేఆర్...

వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లకు చెరో రూ.8 కోట్లు చెల్లిస్తున్న కేకేఆర్, రూ.10.75 కోట్లతో శార్దూల్ ఠాకూర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. వీరితో పాటు అనుకుల్‌ రాయ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి కుర్రాళ్లు కూడా కేకేఆర్‌లో ఉన్నారు.. 

2021 సీజన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్, గత సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచింది.. ఆండ్రే రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓ హిట్టింగ్ ఆల్‌రౌండర్ కావాలి. 

వేలంలో బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్ వంటా స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు.. అయితే వీరికి ఎంత లేదన్నా రూ.8-10 కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉంది. పర్సులో ఉన్న రూ.7 కోట్లతో కేకేఆర్ ఫారిన్ స్టార్ ప్లేయర్లను కొనాలని ప్రయత్నం చేసే అవకాశం లేదు...

కేకేఆర్ ఓ ప్లేయర్ కోసం మహా అయితే రూ.4 కోట్ల వరకూ పెట్టేందుకు సిద్ధం కావచ్చు. 11 స్లాట్స్ ఖాళీగా ఉండడంతో రూ.4 కోట్లు పెట్టి ఓ ప్లేయర్‌ని కొనుగోలు చేయడం కూడా పెద్ద రిస్కే అవుతుంది...

విదేశీ ప్లేయర్ల కోసం రిస్క్ చేయకుండా స్వదేశీ టాలెంట్ కోసం చూడాల్సిన స్థితిలో ఉంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. మిగిలిన ఫ్రాంఛైజీల పర్సు ఖాళీ అయిన తర్వాత వేలంలోకి వచ్చే ప్లేయర్లను బేస్ ప్రైజ్‌కి తీసుకోవడమే కేకేఆర్‌కి బెస్ట్ స్ట్రాటెజీ అవుతుంది.. 

click me!