IPL 2023: ఐపీఎల్ -16లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా విఫలమవుతున్నా కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో రాణించిన వార్నర్ ఐపీఎల్ లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను నడిపిస్తున్న సారథి డేవిడ్ వార్నర్.. రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా ఇటీవలే రికార్డులకెక్కిన వార్నర్.. మంగళవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో ఘనత సాధించాడు.
27
Image credit: PTI
ఐపీఎల్ లో అత్యధిక బౌండరీలు సాధించిన తొలి విదేశీ క్రికెటర్ గా వార్నర్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ లో 600 బౌండరీలు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా రెండు ఫోర్లు కొట్టిన తర్వాత వార్నర్ ఈ రికార్డు సాధించాడు. ముంబై తో మ్యాచ్ లో వార్నర్.. 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అతడు 6 ఫోర్లు కొట్టాడు.
37
ఈ జాబితాలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అందరికంటే ముందున్నాడు. ధావన్ ఐపీఎల్ లో ఏకంగా 728 బౌండరీలు బాదాడు. ఆ తర్వాత వార్నరే ఉన్నాడు. వార్నర్.. 166 మ్యాచ్ లలోనే 604 బౌండరీలు కొట్టాడు.
47
Image credit: PTI
వార్నర్ తర్వాత ఈ జాబితాలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ 591 బౌండరీలతో మూడో స్థానంలో నిలిచాడు. 528 ఫోర్లు బాదిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉండగా సురేశ్ రైనా.. 506 ఫోర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
57
Image credit: PTI
వార్నర్ ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో భాగంగా హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఆరు వేల పరుగుల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. ధావన్ ఐపీఎల్ లో 166 మ్యాచ్ లు ఆడి 6,090 రన్స్ చేశాడు. ఈ కమ్రంలో వార్నర్.. 57 హాఫ్ సెంచరీలు 4 సెంచరీలు సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి విదేశీ క్రికెటర్ కూడా వార్నరే.
67
అయితే ఐపీఎల్ లో వార్నర్ కంటే ముందే కోహ్లీ, శిఖర్ ధావన్ లు ఈ ఘనత అందుకున్నారు. కోహ్లీ.. ఐపీఎల్ లో 226 మ్యాచ్ లు ఆడి 6,788 రన్స్ చేశాడు. కోహ్లీకి ఐపీఎల్ లో 46 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలున్నాయి.
77
ధావన్ 209 మ్యాచ్ లలో 6,469 రన్స్ సాధించాడు. గబ్బర్ కు ఐపీఎల్ లో 49 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలున్నాయి. ఇటీవలే సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ధావన్.. 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరో పరుగు చేసుంటే ధావన్ మూడో సెంచరీ అయ్యుండేది.