MS Dhoni: రిటైర్మెంట్‌పై అదే అస్పష్టత.. ధోని ఏం చెప్పాడంటే..!

First Published May 30, 2023, 12:34 PM IST

MS Dhoni Retirement: సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచే దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని.. మరోసారి అలాంటి ప్రకటనే   చేయడానికి సిద్ధమయ్యాడా..? ఈ సీజన్ మొత్తంతో పాటు నిన్న ధోని చేసిన వ్యాఖ్యలు చూస్తే  అదే అనిపించక మానదు. 

ఐపీఎల్-16 ప్రారంభానికంటే ముందు - ‘ఈ సీజన్ లో ఆడి ధోని రిటైర్ అవుతాడా..?  చెన్నైకి కప్  కొట్టినాక రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో..!’. రెండు నెలలు గడించింది.  ఐపీఎల్ -16 ముగిసింది. ఇప్పుడు కూడా ‘ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడా..?’  రోజులు మారుతున్నా.. సీజన్లు గడుస్తున్న  ఇదే చర్చ. ఇది ఇప్పటిది కాదు 2019   నుంచి సాగుతూనే ఉంది. 

Image credit: PTI

ఈ సీజన్ లో అయినా ధోని రిటైర్మెంట్ పై స్పష్టత వస్తుందా..? అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. కర్ర విరగొదు, పాము చావదు అన్న  సూత్రంలో  తన రిటైర్మెంట్ గురించి  నిత్యం అభిమానులను  తికమకపెట్టే సమాధానాలిచ్చే ధోని.. ఐపీఎల్-16 ఫైనల్ ముగింపున కూడా ఇదే సస్పెన్స్ మెయింటెన్  చేశాడు. 

Latest Videos


గుజరాత్ టైటాన్స్‌తో  అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఫైనల్  తర్వాత  పోస్ట్  మ్యాచ్ ప్రజెంటేషన్ లో ధోనితో ఎలాగైనా  తన రిటైర్మెంట్ గురించి సరైన సమాధానం రాబట్టాలని కామెంటేటర్ హర్షా భోగ్లే యత్నించాడు.  ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘మీకు సమాధానం కావాలా..?  నాకు తెలిసి రిటైర్మెంట్  ప్రకటించడానికి ఇంతకంటే గొప్ప సందర్భమేమీ ఉండదు. ఈ సీజన్ మొత్తంలో వాళ్లు (అభిమానులు) నామీద చూపించిన ప్రేమ, ఆప్యాయతకు చాలా కృతజ్ఞుడిని. 

వాళ్లకు ధన్యవాదాలు చెప్పడం నాకు తేలికైన విషయం.  కానీ నాకు కష్టమైన విషయం ఏంటంటే మరో 9 నెలలు కష్టపడి  తిరిగి రావడమే.  ఇది చాలా శ్రమతో కూడుకున్నది. అప్పటివరకు నా శరీరం ఏ మేరకు సహకరిస్తుందన్నదానిమీద  ఇది (రిటైర్మెంట్) ఆధారపడి ఉంది.   

అయితే దానిపై నేను నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 6-7 నెలల సమయం మిగిలే ఉంది.  నా మీద ఇంత అభిమానం చూపుతున్న వారికి   నా తరఫున ఒక బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నా.  వాళ్లు నా మీద చూపిస్తున్న  ప్రేమ, ఆప్యాయత కోసం నేను వారికోసం  చేయాల్సిన పని నేను భావిస్తున్నా...’అని చెప్పుకొచ్చాడు. 

ఇక  మ్యాచ్ లో  జడేజా చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ కొట్టి గెలిపించిన తర్వాత  ఉద్వేగానికి లోనయ్యాడు ధోని.  సాధారణంగా కూల్ అండ్ కామ్ గా ఉండే ధోని ఇలా  ఎందుకయ్యాడని హర్ష అతడిని ప్రశ్నించాడు. అప్పుడు ధోని మాట్లాడుతూ.. ‘కెరీర్ లో చివరి భాగం అయినందున నేను భావోద్వేగానికి గురవడం సహజమే. అభిమానులు నేను క్రీజులోకి వస్తున్నప్పుడు నా నామస్మరణ చేస్తుంటే  నా కళ్లు చెమర్చాయి.  చెన్నైలో కూడా ఇలాగే  జరిగింది. ఇక్కడ కూడా అదే జరిగింది.  వారికోసమైనా నేను తిరిగి రావాలని అనుకుంటున్నా..’అని చెప్పాడు. 

click me!