గాయం కారణంగా తన కెరీర్ లో హయ్యస్ట్, లోయెస్ట్ ఫేజ్ లను చూశానని, రీహాబిటేషన్ వల్ల తాను రిలాక్స్ అయ్యానని లివింగ్‌స్టొన్ చెప్పాడు. ఫ్రెష్ మైండ్ తో ఐపీఎల్ లోకి బరిలోకి దిగబోతున్నానని రాబోయే సీజన్ లో కూడా రాణిస్తానని అన్నాడు. కాగా పంజాబ్.. ఈనెల 9న హైదరాబాద్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు లివింగ్‌స్టొన్ దూరంగా ఉన్నా ఏప్రిల్ 13న గుజరాత్ టైటాన్స్ తో ఆడబోయే మ్యాచ్ కు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని పంజాబ్ కింగ్స్ వర్గాలు తెలిపాయి.