నొప్పితో ఒక్క సింగిల్ తీయలేకపోయాడు, ఫైట్ అనగానే గ్రౌండ్ అంతా తిరుగుతూ... కెఎల్ రాహుల్‌పై...

Published : May 02, 2023, 04:25 PM IST

కొన్ని సంఘటనలు నొప్పి తెలియకుండా చేస్తాయి. అప్పటిదాకా తొడ కండరాల పట్టేయడంతో నడవడానికి కూడా బాగా ఇబ్బందిపడిన కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ గొడవ జరుగుతున్న సమయంలో నొప్పి మరిచిపోయి గ్రౌండ్ అంతా తిరుగుతూ కనిపించాడు...  

PREV
16
నొప్పితో ఒక్క సింగిల్ తీయలేకపోయాడు, ఫైట్ అనగానే గ్రౌండ్ అంతా తిరుగుతూ... కెఎల్ రాహుల్‌పై...
KL Rahul

ఆర్‌సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కెఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఫాఫ్ డుప్లిసిస్ కొట్టిన బౌండరీని ఆపేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్, తొడ కండరాలు పట్టుకోవడంతో లేచి నిలబడలేకపోయాడు..

26

ఫిజియో సాయంతో లేచి నిలబడిన కెఎల్ రాహుల్, ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు. కెఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చే సమయానికి లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి 8 బంతుల్లో 24 పరుగులు కావాలి..
 

36

రింకూ సింగ్ మాదిరిగా అన్ని ఫోర్లు, సిక్సర్లు బాది మ్యాచ్‌ని ఫినిష్ చేస్తాడేమోనని లక్నో ఫ్యాన్స్ ఆశించారు. అయితే అలాంటిదేమో జరగలేదు. 19వ ఓవర్‌లో ఆఖరి 2 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు కెఎల్ రాహుల్...
 

46
Image credit: PTI

వాస్తవానికి సింగిల్ తీసేందుకు అవకాశం వచ్చినా నొప్పితో పరుగెత్తడానికి ఇబ్బంది కలగడంతో ఆగిపోయాడు. ఈ కారణంగానే ఆఖరి ఓవర్‌లో అమిత్ మిశ్రానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మిశ్రా మొదటి బంతికే స్ట్రైయిక్ రొటేట్ చేద్దామని ప్రయత్నించినా, నడుచుకుంటూ అవతలి ఎండ్‌కి వెళ్లేందుకు కూడా రాహుల్ కష్టపడ్డాడు.

56

మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్ దగ్గరికి వెళ్లి గాయం గురించి అడిగారు. ఇదంతా జరిగిన తర్వాత డ్రామా మొదలైంది. విరాట్ కోహ్లీతో నవీన్ వుల్ హక్, అమిత్ మిశ్రా, గౌతమ్ గంభీర్ గొడవ పడుతుంటే అప్పటిదాకా నడిచేందుకు తెగ ఇబ్బంది పడిన కెఎల్ రాహుల్, గొడవ ఆపేందుకు గ్రౌండ్ అంతా తిరుగుతూ కనిపించాడు..

66

తొడ కండరాలు పట్టుకోవడంతో కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయానికైనా రాహుల్ కోలుకుంటాడా? అనేది అనుమానంగా మారింది.. 

click me!

Recommended Stories