లక్నోకు డబుల్ షాక్.. కెప్టెన్‌తో పాటు అతడూ అనుమానమే.. ఆ లోపు కోలుకోకుంటే టీమిండియాకూ తిప్పలే..

Published : May 03, 2023, 04:48 PM IST

IPL  2023: ఐపీఎల్ -16  సెకండాఫ్ ఊపందుకుంటున్న వేళ లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ షాక్ తగలేలా ఉంది.  అదే జరిగితే కీలక టోర్నీ ముందు టీమిండియాకూ తిప్పలు తప్పవు. 

PREV
18
లక్నోకు డబుల్ షాక్.. కెప్టెన్‌తో పాటు అతడూ అనుమానమే.. ఆ లోపు కోలుకోకుంటే టీమిండియాకూ తిప్పలే..
Image credit: PTI

ఐపీఎల్ -16లో ప్లేఆఫ్స్ రేసులో ముందున్న లక్నో సూపర్ జెయింట్స్ ‌కు  భారీ షాక్. ఆ జట్టు  సారథి కెఎల్ రాహుల్ తో పాటు  పేసర్ జయదేవ్ ఉనద్కత్ లు  ఈ సీజన్ లో  ఆడేది  అనుమానంగానే ఉంది. తొడ కండరాల గాయంతో  రాహుల్, భుజం గాయంతో  ఉనద్కత్ లు  ఈ సీజన్ నుంచి తప్పుకోనున్నారు. 

28

లక్నో - బెంగళూరు మధ్య రెండ్రోజుల క్రితం లక్నో వేదికగా ముగిసిన  మ్యాచ్ లో గాయపడ్డాడు.  మార్కస్ స్టోయినిస్ వేసిన  ఓవర్లో   ఫాఫ్ డుప్లెసిస్ కొట్టిన  బంతిని ఆపబోయి  కిందపడ్డాడు.  దీంతో అతడి తొడకు గాయమైంది.  తొడకు గాయమయ్యాక రాహుల్ ఆఖరి ప్లేస్ లో  బ్యాటింగ్ వచ్చినా  మ్యాచ్ ను  గెలిపించుకోలేకపోయాడు. 

38
KL Rahul

కాగా రాహుల్ ఇంజ్యూరీపై   బీసీసీఐ  ప్రతినిధి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘కెఎల్ రాహుల్ ప్రస్తుతం   లక్నో టీమ్ తోనే ఉన్నాడు.   బహుశా అతడు గురువారం  సాయంత్రం  లక్నో క్యాంప్ ను వీడుతాడు.  లక్నో నుంచి నేరుగా ముంబైకి వెళ్లిన తర్వాత అక్కడ రాహుల్  కు స్కాన్స్ నిర్వహిస్తాం..’అని చెప్పాడు. 

48

ఆర్సీబీ తో మ్యాచ్ తర్వాత  రాహుల్ కు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదని..తొడ కండరాలలో గాయమైతే అవి వాపు రావడం  సర్వసాధారణమేనని  సదరు ప్రతినిధి తెలిపాడు.  వాపు నయం కావడానికి 24 గంటల నుంచి  48 గంటల టైమ్ పడుతుందని ఆ తర్వాతే స్కాన్స్  చేయగలమని  వివరించాడు. 

58

రాహుల్ కు మాదిరిగానే  ఉనద్కత్ కు కూడా గురువారం తర్వాత ముంబైలోనే  స్కాన్స్ చేసి   అతడి వైద్య పరిస్థితిపై సమీక్షించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  స్కాన్స్ తర్వాత వీళ్లు ఐపీఎల్ లో కొనసాగుతారా..? లేదా..? అన్న విషయంతో పాటు   రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో ఆడేదీ లేనిదానిపై ఓ స్పష్టత రానున్నది. 

68
Image credit: PTI

కెఎల్ రాహుల్ తో పాటు  ఉనద్కత్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ లో  ఇదివరకే ఎంపిక చేసిన  15 మంది సభ్యుల టీమ్ లో మెంబర్స్ గా ఉన్నారు.  ఈ ఇద్దరూ ఐపీఎల్  కు దూరమైతే  ఆ ప్రభావం  తర్వాత టీమిండియా మీద కూడా పడొచ్చు. పలు నివేదికల ప్రకారం  కెఎల్ రాహుల్ కోలుకోవడానికి సమారు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉందని  సమాచారం. 

78

ఇదే జరిగితే మాత్రం భారత జట్టుకు కూడా షాక్ తప్పదు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో  భారత్ ఇదివరకే రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ల సేవలు కోల్పోయింది. ఇప్పుడు రాహుల్ కూడా దూరమైతే  అది టీమిండియా బ్యాటింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.  

88
Image credit: PTI

బౌలింగ్  లో కూడా ఉనద్కత్ తో పాటు   ఉమేశ్ యాదవ్  సైతం  చేతి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటివరకైతే ఇదేమీ పెద్ద గాయం కాకపోయినా రాబోయే రోజల్లో ఎక్కువైతే అప్పుడు టీమిండియా కష్టాలు డబుల్ అవుతాయి.  జూన్ 7 న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ముందు మరెంతమంది గాయాలా బాధితులవుతారోనని  టీమిండియా ఫ్యాన్స్  ఆందోళన చెందుతున్నారు. 

click me!

Recommended Stories