అదే సచిన్ టెండూల్కర్‌కి, విరాట్‌కి ఉన్న తేడా! కోహ్లీలో అంత ఓపిక ఉండి ఉంటేనా...

Published : May 03, 2023, 04:04 PM IST

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ఇద్దరే! వరల్డ్ గ్రేటేస్ట్ బ్యాటర్లు. అయితే సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా కీర్తించబడి, క్రికెట్‌లో సాధించినదానికి ‘భారత రత్న’ అందుకుంటే... విరాట్ కోహ్లీ మాత్రం కోట్ల మంది హేటర్స్‌ని సంపాదించుకున్నాడు..

PREV
111
అదే సచిన్ టెండూల్కర్‌కి, విరాట్‌కి ఉన్న తేడా! కోహ్లీలో అంత ఓపిక ఉండి ఉంటేనా...
sachin hails kohli

విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌ల మధ్య గొడవ తర్వాత దీనితో ఏ మాత్రం సంబంధం లేని సచిన్ టెండూల్కర్ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. కారణం ఎన్నో ఏళ్లుగా సచిన్ టెండూల్కర్‌తో, విరాట్ కోహ్లీతో పోలుస్తూ వస్తుండడమే.. 

211

సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు బాదితే, విరాట్ కోహ్లీ ఇప్పటికే 75 సెంచరీలు చేశాడు. సచిన్‌లా సుదీర్ఘ కాలం క్రికెట్ కెరీర్‌ని కొనసాగిస్తే 100 సెంచరీలు అందుకోవడం కోహ్లీకి పెద్ద కష్టమైన విషయమేమీ కాదు..

311
Sachin-Kohli-Anushka

అయితే సచిన్ టెండూల్కర్‌లో ఉన్న ఓ లక్షణం మాత్రం విరాట్ కోహ్లీలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కనిపించలేదు. అదే సహనం, ఓపిక, పరిణతి... 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్‌ని కొనసాగించిన సచిన్ టెండూల్కర్, గ్రౌండ్‌లో ఏ క్రికెటర్‌తో కూడా గొడవకు దిగింది లేదు...

411
sachin kohli

వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెటర్లు, ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవ పడి, వాగ్వాదానికి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ సచిన్ టెండూల్కర్ మాత్రం చాలా కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు...

511
sachin kohli

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన రోజులు, బ్యాటర్లను సెడ్జ్ చేస్తూ బండ బూతులు తిట్టేవాళ్లు. ఎలాగైనా బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నించేవాళ్లు. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం వారందరికీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పేవాడు...

611

మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, షేన్ వార్న్, మిచెల్ జాన్సన్... ఇలా దిగ్గజ బౌలర్లు అందరూ కూడా సచిన్ టెండూల్కర్‌ని సెడ్జ్ చేసి, దెబ్బ తిన్నవాళ్లే. వీళ్లు నోటికి పనిచెప్పిన ప్రతీసారీ, సచిన్ టెండూల్కర్ తన బ్యాటుతో ధీటైన సమాధానం చెప్పేవాడు..

711
sachin kohli bichel

అందుకే సచిన్ టెండూల్కర్‌ని భారతీయులు మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్టు క్రికెటర్లు కూడా ఎంతో గౌరవించేవాళ్లు. అభిమానించేవాళ్లు. అతని కేవలం ఆట వల్ల సంపాదించుకున్న గౌరవం కాదు, హుందాతనంతో తెచ్చుకున్న అర్హత. ఇప్పుడు విరాట్ కోహ్లీలో లేనిది ఇదే...

811

విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలో దూకుడుగా ప్రవర్తిస్తుంటే, అందరూ ఉకుడు రక్తం, కొన్నేళ్లయ్యాక సర్దుకుంటాడు అనుకున్నారు. అయితే మూడు పదుల వయసు దాటినా విరాట్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అదే దూకుడు, అదే ఆవేశం...

911

సచిన్ టెండూల్కర్‌కి ఉన్న ఓపిక, సహనంలో పావు వంతు ఉన్నా విరాట్ కోహ్లీకి భారతీయులు గుడి కట్టేసేవాళ్లు. తన ఆటతో ఎంతో మంది అభిమానాన్ని చురగొన్న విరాట్ కోహ్లీ, చూసిరమ్మంటే కాల్చి వచ్చే టైపు. అన్ని వేళలా అది వర్కవుట్ కాదు. 

1011

కోపం, ఆవేశం, సంతోషం, భాష ఏదో మనసులో దాచుకోలేని వ్యక్తత్వం విరాట్‌ది. ఆఖరిది తాను ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి ‘కింగ్’ని అనే అహం కూడా బయటికి కనబడుతోంది. నవీన్ వుల్ హక్ ఇంతకుముందు షాహిద్ ఆఫ్రిదీ, పెరేరా వంటి సీనియర్లతో ఎంత మందితో గొడవ పడినా అతనిపైనే విమర్శలు వచ్చాయి.. కుర్రాడు కాస్త ఆవేశం తగ్గించుకోవాలని అన్నారు.

1111
sachin kohli

అయితే ఇక్కడ విరాట్‌కి సపోర్ట్ చేసేవారి కంటే కూడా నవీన్ వుల్ హక్‌కి మద్ధతుగా మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు కోహ్లీపై ఇంత నెగిటివిటీ రావడానికి అతను ఏళ్లుగా సంపాదించుకున్న యాటిట్యూడ్ ముద్రే ప్రధాన కారణం. కోహ్లీ ప్లేస్‌లో మరో భారత క్రికెటర్ ఉండి ఉంటే, అతనికి భారతీయులు అందరూ కలిసి అండగా నిలిచేవారనడంలో ఎలాంటి సందేహం లేదు... 

Read more Photos on
click me!

Recommended Stories