అతన్ని కొట్టడం తప్పే! మ్యాచ్ అయ్యాక హగ్ చేసుకుని, అన్నీ మరిచిపోవాలి.. - హర్భజన్ సింగ్

Published : May 03, 2023, 04:47 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన గొడవ, చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగడం చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోయింది..

PREV
19
అతన్ని కొట్టడం తప్పే! మ్యాచ్ అయ్యాక హగ్ చేసుకుని, అన్నీ మరిచిపోవాలి.. - హర్భజన్ సింగ్
gambhir kohli

లక్నోలో జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం నవీన్ వుల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా జరుగుతూనే ఉంది. మధ్యలో గౌతమ్ గంభీర్ రావడంతో గొడవ మరింత పెరిగింది..

29
Mayers and Kohli

2013లో ఈ ఇద్దరి మధ్య గొడవ జరగింది. 10 ఏళ్ల తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడలేదు. తాజాగా ఈ గొడవపై స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. దీన్ని వీలైనంత త్వరగా ముగిస్తే మంచిదంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో కామెంట్ చేశాడు...

39
Kohli vs Gambhir

‘ఈ ఐపీఎల్ అయ్యాక విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి హగ్ చేసుకుని, ఈ గొడవకి ముగింపు పలికితే మంచిది. ఇంకా సాగదీయడం ఇద్దరికీ మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదు. జనాలు దీని గురించి ఎప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు...

49
Gambhir-Kohli

మీరు ఎక్కడికి వెళ్లినా ఏం జరిగింది? ఎవరిది తప్పు? ఏం చేశారని అడుగుతూనే ఉంటారు. బయటివాళ్లు ఏం అనుకుంటున్నారో అవసరం లేదు కానీ ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు...

59

2008లో నాకూ, శ్రీశాంత్‌కి గొడవ జరిగింది. నేను ఆ రోజు అతన్ని కొట్టడం తప్పు. 15 ఏళ్ల తర్వాత కూడా నేను అలా చేసినందుకు సిగ్గు పడుతూ ఉన్నా. అలా జరగకపోయి ఉంటే బాగుండని బాధపడుతూ ఉంటా...
 

69
Harbhajan Singh-Sreesanth

ఆ రోజు నేనే కరెక్ట్, కానీ నేను చేసింది తప్పు. విరాట్ కోహ్లీ ఓ లెజెండ్. నువ్వు ఇలాంటి చిన్న చిన్న గొడవల్లో ఇరుక్కోవడం మీ అభిమానులుగా మాకు నచ్చడం లేదు. విరాట్‌ ప్రతీ దాంట్లో నూరు శాతం ఇవ్వాలని చూస్తాడు..

79

అన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. అక్కడే వచ్చింది అసలు సమస్య. జనాలకి ఎవరిది తప్పో కావాలి. విరాట్ కోహ్లీదా? లేక గౌతమ్ గంభీర్‌దా? లేక నవీన్ వుల్ హక్‌దా అని. అయితే క్రికెట్‌కి మాత్రం గౌరవం కావాలి..

89
Gambhir-Kohli

15 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అప్పుడు అలా జరగకుండా ఉండి ఉంటే బాగుండని ఇప్పటికీ ప్రశ్చాత్యాపపడుతున్నా. ఇప్పటికైనా మీ గొడవకు ముగింపు పలకండి. అప్పుడు మంచి మెమొరీస్ పోగవుతాయి..

99
Kohli-Gambhir

అంతా మరిచిపోయి ఇద్దరూ కలిసి హగ్ చేసుకోండి. పిల్లులు చూస్తున్నారు. కుర్రాళ్లు చూస్తున్నారు. మీరు వాళ్లకి నేర్పేది ఇదేనా. భవష్యత్ తరాన్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనదే. మీ ఇద్దరూ మంచి మెసేజ్ ఇస్తారని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. 

click me!

Recommended Stories