ఆ విషయంలో కోహ్లీ, రోహిత్ కంటే కెఎల్ రాహులే తోపు.. మరో రికార్డు సొంతం

Published : Apr 22, 2023, 06:45 PM IST

IPL 2023: ఐపీఎల్ లో  లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ మరో  ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజ బ్యాటర్లను అధిగమించాడు.  

PREV
16
ఆ విషయంలో  కోహ్లీ,  రోహిత్ కంటే  కెఎల్ రాహులే తోపు..   మరో రికార్డు సొంతం

టీమిండియా వెటరన్ స్టార్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ ఈ ఫార్మాట్ లో మరో ఘనతను అందుకున్నాడు. టీ20లలో అత్యంత వేగంగా 7 వేల పరుగుల క్లబ్ లో చేరిన ఆటగాడిగా   రికార్డులకెక్కాడు. టీమిండియా  దిగ్గజ ఆటగాళ్లు  కోహ్లీ, రోహిత్ లు కూడా   అతడి తర్వాతే ఉన్నారు.  

26

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో  భాగంగా 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద  రాహుల్.. 7 వేల పరుగుల మైలురాయిని    అందుకన్నాడు.  ఈ రికార్డు  చేరుకోవడానికి అతడికి  197 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. 

36

ఈ జాబితాలో కొద్దిసేపటిక్రితం వరకు విరాట్ కోహ్లీ.. అందరికంటే ముందుండేవాడు. కోహ్లీ .. 212 ఇన్నింగ్స్ లలో   ఏడు వేల పరుగుల మైలురాయిని చేరాడు. తాజాగా  రాహుల్  ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం.  

46

కెఎల్ రాహుల్, కోహ్లీల తర్వాత శిఖర్ ధావన్ (246 ఇన్నింగ్స్), సురేశ్ రైనా  (251 ఇన్నింగ్స్) ఉండగా  భారత క్రికెట్ జట్టు సారథి  రోహిత్ శర్మ.. 258 ఇన్నింగ్స్ లలో  ఈ ఘనత సాధించాడు.  

56
Image credit: PTI

కాగా ఇటీవలే రాహుల్.. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తో  శనివారం ముగిసిన మ్యాచ్ లో  రాహుల్ ఈ ఘనత సాధించాడు.   ఈ మ్యాచ్ లో రాహుల్  తన వ్యక్తిగత స్కోరు  30 పరుగులు దాటగానే  ఐపీఎల్ లో  105 ఇన్నింగ్స్ లలోనే 4 వేల పరుగులు దాటిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

66
Image credit: RCB/Facebook

రాహుల్ కంటే ముందు ఈ ఘనత సాధించినవారిలో క్రిస్ గేల్ ముందున్నాడు. గేల్.. 112 ఇన్నింగ్స్ లలో 4 వేల పరుగుల మైలురాయిని అందుకోగా   డేవిడ్ వార్నర్  114 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు.  ఆర్సీబీ మాజీ సారథి  విరాట్ కోహ్లీ.. 128 ఇన్నింగ్స్ లలో  4 వేల పరుగుల క్లబ్ లో చేరగా..  ఏబీ డివిలియర్స్.. 131 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు.  

click me!

Recommended Stories