ఆర్‌సీబీలో ఉంటే ఎప్పటికీ టైటిల్ గెలవలేవు, ఢిల్లీకి వచ్చేయ్... విరాట్ కోహ్లీకి పీటర్సన్ సలహా...

First Published May 22, 2023, 3:36 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవలేకపోయింది. మరోసారి టైటిల్ ఆశలు రేపి, ప్లేఆఫ్స్‌కి కూడా చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. 16 సీజన్లుగా ఆర్‌సీబీకి ఆడుతున్న విరాట్‌ కోహ్లీకి మరోసారి నిరాశ తప్పలేదు..
 

(PTI PhotoShailendra Bhojak)(PTI05_22_2023_000010B)

2023 సీజన్‌లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 639 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ తప్పక గెలవాల్సిన రెండు మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ చేతులు ఎత్తేసినా విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో సెంచరీతో ఆదుకున్నాడు...
 

అయినా బౌలర్లు తేలిపోవడంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయమైపోయింది. ఈ ఓటమితో ఐపీఎల్ 2023 సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్‌సీబీ, 16వ సీజన్‌లోనూ టైటిల్ గెలవలేకపోయింది. దీంతో విరాట్ కోహ్లీ ఇకనైనా టీమ్ మారితే బెటర్ అని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...
 

PTI PhotoShailendra Bhojak)(PTI05_21_2023_000407B)

‘విరాట్, క్యాపిటల్ సిటీకి మారాల్సిన సమయం వచ్చింది..’ అంటూ ఆర్‌సీబీ ఓటమి తర్వాత టీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ సారథి కేవిన్ పీటర్సన్. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో మొట్టమొదటిసారి ఫైనల్ ఆడింది ఢిల్లీ క్యాపిటల్స్...

(PTI PhotoRavi Choudhary) (PTI05_06_2023_000496B)

రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, షేన్ వాట్సన్ దిగ్గజాలు, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి కోచింగ్ స్టాఫ్‌గా ఉన్నారు. అయినా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టైటిల్ గెలవలేకపోయింది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్‌ తోడైతే ఢిల్లీ, ఈజీగా టైటిల్ గెలుస్తుందని అంటున్నాడు కేవిన్ పీటర్సన్.. 

దీనికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2023లో ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ ఫుటేజీని ఐపీఎల్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. 

‘విరాట్ తన చిన్ననాటి కోచ్‌కి నమస్కరిస్తూ అద్భుతమైన వీడియో చూశాక నాకో ఐడియా వచ్చింది. విరాట్‌ని తన సొంత గూటికి ఎందుకు తిరిగి రాకూడదు. వచ్చే సీజన్‌కి ముందు విరాట్ కోహ్లీని సొంత టీమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎంత ఖర్చుకైనా వెనుకాడకూడదు.. బెక్‌హం, రొనాల్డో, మెస్సీలాంటి వాళ్లు కూడా ఇలా తమ కెరీర్‌లో వేరే టీమ్స్‌కి మారారు. మీరేమంటారు?’ అంటూ అభిమానులతో పోల్ నిర్వహించాడు కేవిన్ పీటర్సన్...

Image credit: PTI

కేవిన్ పీటర్సన్ పెట్టిన పోల్‌కి 55 శాతానికి పైగా మంది ‘అవును.. విరాట్, ఢిల్లీకి ఆడాలని’ ఓట్లు వేయగా, 45 శాతం మంది ‘లేదు... కోహ్లీ, ఆర్‌సీబీలోనే ఉండాలి’ అనే ఆప్షన్ ఎంచుకున్నారు...
 

Image credit: PTI

అయితే ఎవరెన్ని చెప్పినా, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే తప్ప విరాట్ కోహ్లీ వేరే టీమ్ తరుపున ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో సొంత రాష్ట్రానికి చెందిన ఢిల్లీ టీమ్ తరుపున ఆడాలని అనుకున్నాడు విరాట్ కోహ్లీ.

అయితే ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ కంటే లెఫ్టార్మ్ పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌ని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించడంతో అండర్19 వరల్డ్ కప్ 2008 విన్నింగ్ కెప్టెన్ ఆర్‌సీబీకి వచ్చాడు...
 

Image credit: PTI

ఆరంభంలో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో ఆర్‌సీబీతో ప్రత్యేకమైన అనుబంధం పెంచుకున్న విరాట్ కోహ్లీ, అదే ఫ్రాంఛైజీ తరుపున రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాడు...

click me!