చెన్నై ఇంతవరకూ గుజరాత్‌ను ఓడించలేదు.. ముంబైపై లక్నో ఓడలేదు.. ఆసక్తికరంగా ప్లేఆఫ్స్ రేసు

First Published May 22, 2023, 2:14 PM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్-16 లీగ్ దశ ముగిసింది.   ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ రేసు  రేపటినుంచి చెన్నై వేదికగా మొదలుకానుంది. 

సుమారు  రెండు నెలలుగా  జరుగుతున్న ఐపీఎల్  -16 లో  లీగ్ దశ పోటీలు ముగిశాయి.  పాయింట్ల పట్టికలో టాప్ - 4 లో నిలిచిన గుజరాత్  జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్,  ముంబై ఇండియన్స్  లు ప్లేఆఫ్స్ లో తలపడనున్నాయి.  

అయితే ఈ నాలుగు జట్లలో   భాగంగా క్వాలిఫయర్ - 1  చెన్నై - గుజరాత్ మధ్య జరుగనుండగా ఎలిమినేటర్ మ్యాచ్  లక్నో - ముంబై మధ్య   మ్యాచ్ లు జరుగనున్నాయి.  కాగా ఈ రెండు మ్యాచ్ ల నాలుగ  జట్ల ప్రత్యర్థుల మధ్య ఆసక్తికర గణాంకాలున్నాయి. 

గతేడాది  లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ తో  చెన్నై సూపర్ కింగ్స్..  ఇప్పటివరకూ 3 మ్యాచ్ లు ఆడింది.  గత సీజన్ లో  ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు  జరిగాయి. రెండు సార్లూ  గుజరాత్ దే విజయం.  ఈ సీజన్ లో కూడా ఫస్ట్  మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే  జరిగింది. ఇందులోనూ చెన్నైకి ఓటమి తప్పలేదు. 

గుజరాత్ తో  పాటే  లక్నో కూడా గతేడాదే లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  లక్నో  సూపర్ జెయింట్స్ తో  ముంబై ఇండియన్స్  గత సీజన్ లో రెండు మ్యాచ్ లు ఆడింది.   ఆ రెండు మ్యాచ్ లలో  లక్నోదే విజయం.  రెండింట్లోనూ కెఎల్ రాహుల్ సెంచరీ చేశాడు.  

ఈ ఏడాది కూడా  లక్నో.. ముంబైతో తలపడింది. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా  లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో   కృనాల్ పాండ్యా   సారథ్యంలోని లక్నో.. రోహిత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ను  ఐదు పరుగుల తేడాతో  ఓడించింది.  

ఇప్పుడు  క్వాలిఫయర్ -1 లో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ ను ఢీకొననుంది.  ఎలిమినేటర్  మ్యాచ్ లో   లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.  ఈ నేపథ్యంలో   ఈ రెండు మ్యాచ్ లలో ఎవరిని విజయం వరిస్తుందో  చూడాలి 

click me!