కేదార్ జాదవ్ మళ్లీ వస్తున్నాడు... డేవిడ్ విల్లే ప్లేస్‌లో ఊహించని ప్లేయర్‌ని పట్టుకొచ్చిన ఆర్‌సీబీ...

Published : May 01, 2023, 05:13 PM IST

కేదార్ జాదవ్, ఐపీఎల్‌లో ఓ ముగిసిన శకం... అనుకున్నారంతా. ఎందుకంటే  ఐపీఎల్ 2022 మెగా వేలంలో, 2023 మినీ వేలంలో కేదార్ జాదవ్ అమ్ముడుపోలేదు. అలాంటి కేదార్ జాదవ్, ఊహించని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి రాబోతున్నాడు...

PREV
18
కేదార్ జాదవ్ మళ్లీ వస్తున్నాడు... డేవిడ్ విల్లే ప్లేస్‌లో ఊహించని ప్లేయర్‌ని పట్టుకొచ్చిన ఆర్‌సీబీ...

గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ డేవిల్ విల్లే ప్లేస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ని తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

28

2010లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్, ఇప్పటిదాకా 93 మ్యాచులు ఆడి 1196 పరుగులు చేశాడు. గతంలో ఆర్‌సీబీ తరుపున 17 మ్యాచులు ఆడిన కేదార్ జాదవ్‌ని బేస్ ప్రైజ్ రూ.1 కోటికి టీమ్‌లోకి తీసుకున్నట్టు ప్రకటించింది ఈ సాలా కప్ నమ్‌దే బ్యాచ్...

38

పేరుకి ఆల్‌రౌండర్ అయినా ఐపీఎల్‌లో కేదార్ జాదవ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసింది లేదు. బ్యాటింగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఇరగదీసింది కూడా లేదు. అలాంటి ప్లేయర్‌ని ఆర్‌సీబీ, ఏరికోరి సెలక్ట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

48

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్, ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ కేరళ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్‌కి ఆడాడు. 

58

2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో కేదార్ జాదవ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. దీంతో అతన్ని వేలానికి వదిలేసింది సీఎస్‌కే. 2021 వేలంలో రూ.2 కోట్లు పెట్టి కేదార్ జాదవ్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

68

జాదవ్ అన్న లెగ్ మహిమో ఏమో కానీ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా ఆఖరి పొజిషన్‌లో నిలిచింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్‌లో అమ్ముడుపోని కేదార్ జాదవ్, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అనుకోకుండా ఆర్‌సీబీ నుంచి జాదవ్‌కి పిలుపు వచ్చింది.

78

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఏం బాగోలేదు. భారీ ఆశలు పెట్టుకున్న జోష్ హజల్‌వుడ్ గాయంతో బాధపడుతూ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. బ్యాటింగ్‌లో కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తప్ప మరో బ్యాటర్ ఆడడం లేదు..

88
Image credit: PTI

బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ తప్ప మరో ఆర్‌సీబీ బౌలర్ సరిగ్గా రాణించడం లేదు. ఇలా అష్టకష్టాలతో మొదటి 8 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచుల్లో కనీసం 4 గెలవాల్సి ఉంటుంది..

click me!

Recommended Stories