బుమ్రాని ఆడించడానికి ఆసక్తి చూపని రోహిత్... ఆఖరి రెండు టెస్టులకూ డౌటే! నేరుగా ఐపీఎల్‌లోనే...

Published : Feb 13, 2023, 01:27 PM IST

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఆరు నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో రెండు మ్యాచులు ఆడి గాయపడిన రవీంద్ర జడేజా, ఐదు నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే బుమ్రా మాత్రం ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు...

PREV
18
బుమ్రాని ఆడించడానికి ఆసక్తి చూపని రోహిత్... ఆఖరి రెండు టెస్టులకూ డౌటే! నేరుగా ఐపీఎల్‌లోనే...
Jasprit Bumrah

వెన్నునొప్పితో బాధపడుతున్న జస్ప్రిత్ బుమ్రా, ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జట్టుకి దూరమయ్యాడు. ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి 2 మ్యాచులు ఆడిన బుమ్రా... గాయం తిరగబెట్టడంతో మళ్లీ టీమ్‌కి దూరమయ్యాడు. బుమ్రాకి అయిన గాయం పెద్ద తీవ్రమైనదేమీ కాదని, అతను రెండు మూడు వారాల్లో తిరిగి వస్తాడని కామెంట్ చేశాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

28

ద్రావిడ్ ఈ కామెంట్లు చేసి నాలుగు నెలలు దాటినా ఇప్పటిదాకా జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి జస్ప్రిత్ బుమ్రాని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ, ఏమైందో ఏమో కానీ రెండు రోజుల్లో అతను కోలుకోలేదని టీమ్‌ నుంచి తప్పిస్తున్నట్టు మరోసారి ప్రకటన చేసింది...

38
Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి ఎప్పుడో కోలుకున్నాడని, అయితే అతన్ని ఆడించడానికి టీమిండియా సుముఖంగా లేదని విషయం మాత్రం అందరికీ తెలుసు... స్వదేశంలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్నర్లే మెయిన్. కేవలం ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ చేయడానికి మాత్రమే ఫాస్ట్ బౌలర్లు అవసరం అవుతారు...
 

48
Image Credit: Getty Images

ఈ పని చేయడానికి మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీతో పాటు ఉమేశ్ యాదవ్ కూడా ఉన్నాడు. అందుకే జస్ప్రిత్ బుమ్రాని మొదటి రెండు టెస్టులకు దూరం పెట్టింది బీసీసీఐ. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే ఆఖరి రెండు మ్యాచుల్లో బుమ్రాని టీమ్‌లోకి తెచ్చి ఆడించాలని అనుకున్నారు..

58

అయితే తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో గెలవడంతో జస్ప్రిత్ బుమ్రాకి పూర్తిగా రెస్ట్ ఇచ్చి, ఐపీఎల్‌లో బరిలో దింపాలని ఫిక్స్ అయ్యాడట కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 14 నుంచి 17 మ్యాచులు ఆడేందుకు ఫిట్‌గా ఉండాలి. అలా ఫిట్‌గా ఉండాలంటే ఇప్పుడు టెస్టు మ్యాచులు ఆడకపోవడమే బెటర్ అని ముంబై టీమ్‌, రోహిత్‌కి సూచనలు ఇచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినబడుతున్నాయి...
 

68
Image credit: Getty

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడడం అనుమానమే. టెస్టు సిరీస్‌ గెలిస్తే భారత జట్టు సీనియర్లు అందరూ వన్డే సిరీస్‌కి దూరంగా ఉంటారు. కాబట్టి బుమ్రాని పక్కనబెట్టినా ఎవ్వరూ పట్టించుకోరు...
 

78
Image credit: Getty

ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత 10 రోజుల గ్యాప్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడకపోయినా ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరిగే ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బుమ్రా ఆడడం చాలా అవసరం. ఆ మ్యాచ్‌కి బుమ్రా ఫిట్‌గా ఉండాలంటే ఐపీఎల్‌లో వీలైనన్ని తక్కువ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది...
 

88

ఐపీఎల్ కోసం టీమిండియా ఆడే టెస్టు సిరీస్ నుంచి జస్ప్రిత్ బుమ్రాని తప్పించిన రోహిత్ శర్మ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సిద్ధంగా ఉంచడం కోసం అతన్ని ఐపీఎల్‌ నుంచి తప్పిస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు... 

click me!

Recommended Stories