రెండు వైడ్లు వేస్తే, ఫ్రీ హిట్ ఇవ్వాలి! అప్పుడే బౌలర్ల తిక్క కుదురుతుంది... ‘ఎక్స్‌ట్రాల’పై సునీల్ గవాస్కర్...

First Published Apr 6, 2023, 6:44 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా నమోదైన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ గేమ్‌లే. మొదటి 7 మ్యాచుల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు కానీ ‘ఎక్స్‌ట్రా’లు మాత్రం రికార్డు లెవెల్లో పెరిగిపోతున్నాయి.. ఒకే ఓవర్‌లో రెండు, మూడు, నాలుగు వైడ్లు వేస్తున్నారు బౌలర్లు...

(Source: PTI)

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి 20 ఎక్స్‌ట్రాలే ఇచ్చాయి. ఆ తర్వాతే పరిస్థితి గాడి తప్పింది.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ వరుసగా నాలుగు వైడ్లు వేశాడు. మొత్తంగా ఒకే ఓవర్‌లో 5 వైడ్లు ఇచ్చాడు. అంటే 11 బంతులు వేశాడు. ఒక్క ఓవర్ పూర్తి చేయడానికి రెండు ఓవర్ల సమయం తీసుకున్నాడన్నమాట...

అదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ అర్షద్ ఖాన్ వరుసగా 3 వైడ్లు వేశాడు. సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో అయితే ఏకంగా 34 ఎక్స్‌ట్రాలు నమోదయ్యాయి. ఆవేశ్ ఖాన్, దీపక్ చాహార్ ఐదేసి వైడ్లు వేస్తే తుషార్ దేశ్‌పాండే 4, రాజ్‌వర్థన్ హంగర్‌గేకర్ 3 వైడ్లు వేశారు.. అంటే 5 ఓవర్ల కంటే ఎక్కువ సమయమే ‘ఎక్స్‌ట్రా’ అయ్యింది..
 

Latest Videos


(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000319B)

మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఎక్స్‌ట్రాలపై బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ‘బౌలర్లు ఇప్పటికైనా వైడ్లు, నో బాల్స్ వేయడం తగ్గించాలి. లేదంటే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా... ఇది వారికి సెకండ్ వార్నింగ్. ఇంకో వార్నింగ్ ఇవ్వను..’ అంటూ కామెంట్ చేశాడు ధోనీ..

(PTI PhotoRavi Choudhary)(PTI04_04_2023_000257B)

గుజరాత్ టైటాన్స్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో 10 పరుగులు అదనంగా ఇచ్చేశాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌‌నే 3 వైడ్లతో మొదలెట్టాడు మహ్మద్ షమీ. 
 

సాధారణంగా 3 గంటల 30 నిమిషాల్లో అయిపోవాల్సిన మ్యాచ్, ఈ ఎక్స్‌ట్రాల కారణంగా ఎక్స్‌ట్రా టైం తీసుకుని, మ్యాచ్ పూర్తి కావడానికి 4 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకూ సమయం పడుతోంది. దీనిపై సీరియస్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...

Image credit: PTI

‘వరుసగా రెండు లేదా 3 వైడ్లు వేస్తే బ్యాటర్‌కి ఫ్రీ హిట్ ఇచ్చేయాలి. ఈ వైడ్ల కారణంగా విలువైన సమయం వృథా అవుతోంది. ఫ్రీ హిట్ ఇస్తే బౌలర్లు దారిలోకి వస్తారు. లైన్ చూసుకుని జాగ్రత్తగా బౌలింగ్ చేస్తారు. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేస్తే మంచిది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్.. సన్నీ సలహాని ‘దారుణమైన ఐడియా’గా అభివర్ణించాడు విండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్..

click me!