ఆది నుంచి ఆర్‌సీబీ అంటే హైదరాబాద్‌‌కి భలే మోజు... బెంగళూరు ఓడితే ప్లేఆఫ్స్‌కి ఆ రెండు జట్లు...

Published : May 18, 2023, 09:54 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలబడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్‌సీబీ ఆశలు ఆవిరవుతాయి...

PREV
110
ఆది నుంచి ఆర్‌సీబీ అంటే హైదరాబాద్‌‌కి భలే మోజు... బెంగళూరు ఓడితే ప్లేఆఫ్స్‌కి ఆ రెండు జట్లు...
Image : PTI

12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గెలిస్తే టాప్ 4లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ రిజల్ట్ ప్లేఆఫ్స్ బెర్తులను డిసైడ్ చేస్తుంది..
 

210

అయితే ఐపీఎల్‌లో బెంగళూరుకి మొదటి నుంచి షాకులు ఇస్తున్న టీమ్ ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. 2009లో మొదటిసారి ఆర్‌సీబీ ఫైనల్‌కి వెళ్లింది. ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించిన డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచింది...

310
Image credit: PTI

2012లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఓడింది ఆర్‌సీబీ. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను మిస్ చేసుకుంది

410
PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000254B)

2013లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఓడించి ప్లేఆఫ్స్ చేరింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కీలక మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరలేకపోయింది...

510
Image credit: PTI

2015లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీని టాప్ 2లో లేకుండా చేసింది. దీంతో ఆర్‌సీబీ మొదటి క్వాలిఫైయర్ ఆడే ఛాన్స్ కోల్పోయింది...
 

610

2016లో విరాట్ కోహ్లీ సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కి దూసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది...

710

2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడింది ఆర్‌సీబీ. ఈ మ్యాచ్‌లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంటిదారా పట్టింది. ఆర్‌సీబీని ఓడించిన సన్‌రైజర్స్, రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీ చేతుల్లో ఓడింది...

810

2021లో కూడా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీని 4 పరుగుల తేడాతో ఓడించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఓటమితో ఆర్‌సీబీ టాప్ 2 నుంచి కిందకి జారి లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది...

910

2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 68 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇలా ప్రతీసారీ ఆర్‌సీబీ ప్లాన్స్‌ని చెడగొట్టడంలో ముందున్న సన్‌రైజర్స్... ఈసారి బెంగళూరుపై గెలిచిందో, ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరడం క్లిష్టంగా మారుతుంది..

1010

నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే... రెండు, మూడు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ బెర్తులను కన్ఫార్మ్ చేసుకుంటాయి. మిగిలిన బెర్త్ కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయి. 

click me!

Recommended Stories